
పుట్టిన తేదీ: 11 అక్టోబర్ 1988
స్వస్థలం: హైదరాబాద్
వృత్తి: నటుడు
విద్య: ఏరోనాటికల్ ఇంజనీరింగ్
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో పాపులర్ అయ్యాడు అభిజిత్. తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్న అభిజిత్ మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో మరోసారి అలరించాడు. ఆ తర్వాత అతను నటించిన పెళ్లి గోల వెబ్ సిరీస్ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వెండితెరపై మళ్లీ కనిపించకుండా పోయిన ఆయన ఇప్పుడు బిగ్‌బాస్‌తో బుల్లితెరపై తొలిసారి అడుగు పెడుతున్నాడు. అక్కినేని కుటుంబంతో ఇతనికి మంచి అనుబంధం కూడా ఉంది. కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చదివిన కిండర్ గార్డెన్(చైతన్య విద్యాలయ) పాఠశాలలోనే ఇతను కూడా చదువుకున్నాడు. అఖిల్ స్కూల్‌మేట్ మాత్రమే కాదు, అతని క్లాస్‌మేట్, ఫ్రెండ్ కూడా. కాగా అభిజిత్ పూర్వీకులు చార్మినార్ నిర్మాణంలో పాలుపంచుకోవడం విశేషం. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో అమాయకంగా కనిపించే అభిజిత్ బిగ్‌బాస్‌లోనూ అమాయకంగా ఉంటాడా? అందరినీ ఓ ఆటాడిస్తాడా చూడాలి.