నిన్న అసలు గేమే ఆడని అభిజిత్‌కు నేడు మెదడు పాదరసంలా పని చేసింది. అతడు చెప్పిన కిడ్నాప్ ప్లాన్ బాగా వర్కవుట్ అయింది. అసలీ ప్లాన్‌తో ఏమాత్రం సంబంధం లేని కుమార్ సాయి మాత్రం అటు తన టీమ్‌తోనూ, ఇటు ప్రత్యర్థి టీమ్‌తోనూ తిట్లు తినిపించుకున్నాడు. అతనికి ఇంటి సభ్యులు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదు. అతను చెప్పే మాటను వినిపించుకోవడం సరికదా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వక పోవడం గమనార్హం. ఇక కిడ్నాప్ చేసిన రోబోలకు సోహైల్ తన ఉగ్రరూపం చూపించాడు. నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి...
భీభత్సంగా వర్కవుట్ అయిన కిడ్నాప్ ప్లాన్
మనుషుల టీమ్‌లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని అభి రోబోలకు సలహా ఇచ్చాడు. లాస్య, అరియానా వద్దంటూనే దీనికి ఒప్పుకున్నారు. అనంతరం రోబో టీమ్ సభ్యులు కిడ్నాప్ రిహార్సల్ కూడా ట్రై చేశారు. ఆ వెంటనే అభి వెళ్లి అమ్మాయిలు వాష్‌రూమ్ వాడుకునేందుకు అవకాశమిస్తామని సలహా ఇచ్చాడు. గంగవ్వ కూడా టాస్క్‌లో లీనమై మనుషులును ట్రాప్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో దివి వాష్‌రూమ్‌కు వెళ్లింది. కానీ తిరిగి వచ్చే సమయంలో రోబోలు మూకుమ్మడిగా అటాక్ చేసి ఆమెను అమాంతం పట్టేసుకున్నాయి. ఊహించని దెబ్బకు షాక్ అయిన దివి 'హెల్ప్' అని అరవడంతో మనుషులు తనకు ఏమైందోనని కంగారు పడ్డారు. తాము హర్ట్ చేయట్లేదని అభి చెప్పినప్పటికీ మనుషుల టీమ్ మాత్రం టెంపర్ లూజై నోటికొచ్చిన బూతులు అనేశారు. కానీ లోపల దివికి ఎంచక్కా భోజనం కూడా తినిపించారు.
మనుషుల ఆవేశాన్ని చల్లార్చిన దివి
మనిషి ఇంపార్టెంటా? గేమ్ ఇంపార్టెంటా? అంటూ డోర్ ఓపెన్ చేయమని అమ్మ రాజశేఖర్ బిగ్‌బాస్‌ను అడిగాడు. మనుషుల టీమ్ ఎంత మొత్తుకున్నా ఆ డోర్ మాత్రం తెరవలేదు. అమ్మాయిని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడినందుకు మాస్టర్, మెహబూబ్, మోనాల్, సుజాత కంటతడి పెట్టుకున్నారు. దీంతో రోబోలు డోర్ దగ్గరకు రాగానే గార్డెన్ ఏరియాలో ఉన్న మనుషులు విరుచుకుపడ్డారు. దీంతో అప్పుడే అక్కడకు వచ్చిన దివి అసలేం జరిగిందో కూల్‌గా వివరించింది. ఆమె చిప్పింది వినగానే మనుషుల కోపాగ్నిపై నీళ్లు చల్లినట్లైంది.
కిడ్నాప్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు
'మా దగ్గర ఇంకో ఆప్షన్ లేదు, అందుకే కిడ్నాప్ చేశాం, ఆమెను నేను పట్టుకోలే'దని అభి నోయల్‌కు చెప్పాడు. తరువాత మనుషుల టీమ్ దివిని బయటకు తీసుకెళ్లేందుకు లోనికి వచ్చారు. ఈ క్రమంలో సోహైల్, మెహబూబ్, అఖిల్.. అభిజిత్‌తో, అవినాష్‌తో గొడవ పడ్డారు. 'మీకంత కోపముంటే, నేను తప్పు చేశాను అనిపిస్తే, వెన్నుపోటు పొడిచాననుకుంటే నన్ను నామినేట్ చేయండి. నాకిది అగ్ని పరీక్ష' అని అభి తేల్చి చెప్పాడు. ఇంట్లోకి వచ్చిన మనుషులు వాష్‌రూమ్ వాడుకున్నారు కానీ రోబోలకు చార్జింగ్ ఇవ్వలేదు, వాళ్లు కూడా అడగలేదు. తీరా మనుషులు వెళ్లిపోయాక ఇదే విషయం గురించి హారిక, అరియానా గొడవ పడ్డారు. (గుమ్మడికాయలు అమ్మే చిరు వ్యాపారి కుమారుడు..మెహబూబ్ దిల్‌సే)
హారిక, అరియానాలకు గొడవ
అంతేకాకుండా మోసానికి మోసమే సమాధానంగా బయటకు వెళ్లేటప్పుడు కొన్ని పండ్లను కూడా పట్టుకెళ్లారని తెలిసి రోబోలు నిర్ఘాంతపోయారు. కష్టపడి ఒకరిని లోనికి రప్పించి చార్జింగ్ తీసుకున్నారు, కానీ అందరూ లోపలికి వచ్చీ అన్నీ వాడేసుకుంటే మాత్రం ఎవరూ పట్టించుకోకుండా రోబోలు తప్పు చేశారు. తర్వాత అందరూ మొద్దు నిద్రలో ఉన్నప్పుడు దొంగచాటుగా చార్జింగ్ పెట్టుకుందామని అరియానా ప్లాన్ వేసింది. ముసుగు దొంగలా బెడ్‌షీటు కప్పుకుని మాస్టర్ దగ్గరకు ప్రవేశించింది. ఇంతలో సోహైల్ నిద్ర లేచి చూసేయడంతో అరియానా అడ్డంగా దొరికిపోయింది. దీంతో చార్జింగ్ పెట్టుకుందామనే వచ్చానని చెప్పేసింది. ఇక ఈ గేమ్ ఇప్పట్లో ముగిసేటట్లు కనిపించడం లేదు. రేపు కూడా ఈ ఫిజికల్ టాస్క్ కొనసాగనుంది. (అవును, నాకు కరోనా సోకింది: బిగ్‌బాస్ విజేత)
Comments
Please login to add a commentAdd a comment