
మోనాల్ గజ్జర్.. ఈ గుజరాతీ బ్యూటీ బిగ్‌బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంటు కూడా! కష్టపడి తెలుగు నేర్చుకుంటోంది, ముద్దుముద్దుగా మాట్లాడుతోంది. కానీ ఎమోషన్స్ ఆపుకోలేనప్పుడు మాత్రం హిందీలోనో, ఇంగ్లీషులోనో బోరుమనేస్తుంది. దీంతో నాగార్జున ఆమెకు నర్మద అని పేరు కూడా పెట్టారు. అయితే షో సగం పూర్తి కావచ్చినా ఇప్పటికీ ఆమె కన్నీళ్లు ఇంకిపోవడంలేదు. పాతాళ గంగలా ఉబికి వస్తూనే ఉన్నాయి. కారణం.. అఖిల్, అభిజిత్..!
ఇద్దరూ వదిలేశారు..
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పటి నుంచే మోనాల్.. అభి, అఖిల్ ఇద్దరితో చనువుగా ఉండేది. ఆమెతో మాట్లాడే సమయం కోసం ఆ ఇద్దరు కూడా పోటీ పడినట్లు కనిపించేవారు. ఆమె కోసం ఏదైనా చేసేవారు. కానీ కాలం మారింది. పరిస్థితులు కూడా మారిపోయాయి. బంధాలు వేరైపోయాయి. శత్రవులు మిత్రువులయ్యారు. మిత్రువులు శత్రువులయ్యారు. అయితే ఇదంతా ఎలా జరిగిందంటే.. అభి, అఖి ఇద్దరి మధ్య నలిగిపోయిన మోనాల్ ఒక్కోసారి ఏం మాట్లాడుతుందో తనకే అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. (చదవండి: మోనాల్-అభి మధ్య దూరాన్ని అఖిల్ తగ్గిస్తాడా?)
క్షమించమన్నా వినిపించుకోని అభిజిత్
పొరపాటునే అన్నదో, కావాలనే అన్నదో తెలీదు కానీ అభిజిత్‌ను మానిప్యులేటర్ అని పెద్ద తప్పు చేసింది. అక్కడ రాజుకున్న వివాదంతో అభికి దూరమైంది. అలా అనడం తప్పేనని మోనాల్ క్షమాపణలు కోరినా అభి వినిపించుకోలేదు. దూరంగా ఉంటే ఇద్దరికీ మంచిదని కరాఖండిగా చెప్పాడు. ఈ గొడవ తర్వాత అఖిల్- మోనాల్ కలిసున్నారు. కానీ అఖిల్ గురించి సోహైల్ వెనకాల ఏదో మాట్లాడుతున్నాడని మోనాల్ అఖిల్‌తో చెప్పడంతో మరో గొడవలో ఇరుక్కుంది. అక్కడ నుంచి అఖిల్‌కు మోనాల్ మీద నమ్మకం సన్నగిల్లింది. ఆమెపై ఉన్న ఇష్టం ఆవిరయ్యింది. కానీ ఇదే కారణాన్ని ప్రస్తావించకుండా టాస్క్ బాగా ఆడలేదంటూ ఏవేవో కారణాలు చెప్తూ మోనాల్‌ను నామినేట్ చేశాడు. ఆమె కన్నీళ్లు కారుస్తున్నా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ఇప్పటికీ ఆమెతో మాట్లాడటమే మానేశాడు.
ఏ గ్రూపులోనూ చేరలేక ఒంటరవుతున్న మోనాల్
అఖిల్ కూడా దూరమవుతాడని ఊహించని మోనాల్ ఒంటరినయ్యానంటూ మాస్టర్ దగ్గర భోరున ఏడ్చేసింది. దీంతో నేను నీకు సపోర్ట్ చేస్తా అని మాస్టర్ ఆమెకు మాటిచ్చాడు. కానీ మాస్టర్ గ్రూపులో ఆమె కలవలేకపోతోంది. మరోవైపు అఖిల్.. అభిజిత్, హారిక, లాస్య గ్రూపులో ఒకడిగా చేరిపోయాడు. ఎలాగో ఈ గ్రూపులో కలవడానికి ఆమె ధైర్యం చేయదు. కానీ మోనాల్ పరిస్థితిని అర్థం చేసుకున్న అభిజిత్ అప్పుడో ఇప్పుడో ఆమెతో మాట్లాడి సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరి ఏకాకిగా మారిన మోనాల్ బాధను నాగార్జున తొలగించే ప్రయత్నం చేస్తారా? తిరిగి ఆమెను అఖిల్‌తో కలుపుతారా? అందుకు అఖిల్ ఒప్పుకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. (చదవండి: అఖిల్ ఇంకేదో ఆశించాడు, అందుకే..: మోనాల్)