బిగ్‌బాస్‌ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్‌ | Bigg Boss 4 Telugu: First Time Abhijit Forgot Task Conditions | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : కుక్క అనుకున్నా పర్లేదు.. అఖిల్‌

Published Fri, Dec 11 2020 11:30 PM | Last Updated on Sat, Dec 12 2020 5:08 PM

Bigg Boss 4 Telugu: First Time Abhijit Forgot Task Conditions - Sakshi

మొదటి సారి తెలివైనోడు(అభిజిత్‌) టాస్క్‌ కండీషన్స్‌ మర్చిపోయి ఓడిపోయాడు. ప్రతి సారి టాస్క్‌ పేపర్‌ను ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా చదివే అభిజిత్‌.. నేడు మాత్రం ఒక్కసారి కూడా టాస్క్‌ పేపర్‌ చదవలేదు. దీంతో  నిబంధనలు మర్చిపోయి మంచి చాన్స్‌ మిస్సయ్యాడు. ఇక తనకు కెప్టెన్సీ టాస్క్‌కు సహాయం చేసిన మోనాల్‌కు అరుదైన అవకాశం కల్పించి హారిక తన రుణం తీర్చుకుంది. అసలు మన తెలివైనోడు మర్చిపోయిన కండీషన్‌ ఏంటి? మోనాల్‌ రుణం హారిక ఎలా తీర్చుకుందో నేటి ఎపిసోడ్‌లో చదివేద్దాం.

మరింత రెచ్చిపోయిన పులిహోర రాజా
పులిహోర కలపడంతో అఖిల్‌ ఆరితేరిపోయాడు. చాన్స్‌ దొరికితే చాలు ఇంట్లోని అమ్మాయిలను ఇంప్రెస్‌ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నిన్న పులిహోర రాజా అన్న మోనాల్‌తో గొడవ పడిన అఖిల్‌.. ఈ రోజు ఏమో ఆమె ముందే హారికను ఫ్లర్ట్‌ చేశాడు. హారిక ఏదో పనిచేసుకుంటూ కిచెన్‌లో ఉండగా.. అఖిల్ మెల్లగా ఆమె దగ్గరకు చేరాడు. సొహైల్ చూసి.. ఏంటి ఆమె దగ్గరకు పోతున్నావ్ అని అనడంతో.. హారికను వెనకనుంచి వాటేసుకుని ఏం షాంపూ ఇది.. మా దగ్గర లేదే నీ దగ్గరకు ఎలా వచ్చింది? అంటూ ఆమెతో మాటలు కలపడం స్టార్ట్‌ చేశాడు. ఏంట్రా ఇది అంటూనే హారిక కూడా అఖిల్‌తో డబుల్‌ మీనింగ్‌ వచ్చే మాటలు మాట్లాడింది. ఇక హారిక మాటలకు అఖిల్‌ మరింత రెచ్చిపోయి ఆమెపై పాట పాడుతూ.. పక్కనే ఉన్న మోనాల్‌ను ఏడిపించే ప్రయత్నం చేశాడు. కానీ మోనాల్‌ మాత్రం ఏమి విననట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక ఎదురుగా ఉన్న సోహైల్‌.. పులిహోర కలపడంలో నువ్వే తోపువంటూ అఖిల్‌పై పంచ్‌ వేశాడు. ‘నన్ను కుక్క అనుకున్నా పర్లేదు.. కుక్కకు విశ్వాసం ఉంటుంది.. మా యాజమాని(హారిక) దగ్గరకి వస్తే కరిచేస్తా’ అంటూ ఘోరమైన పులిహోర కలిపాడు. 

స్టెప్పులేసి.. గొల్డెన్‌ మైక్‌ పట్టు
ప్రేక్ష‌కుల‌తో మ‌రింత‌ క‌నెక్ట్ అయ్యేందుకు హౌస్‌మేట్స్‌కు బిగ్‌బాస్ మరో అవకాశం ఇచ్చాడు. ఇప్పటికే మూడు రకాల టాస్క్‌లు ఇచ్చిన బిగ్‌బాస్‌.. నాల్లో టాస్క్‌గా వినోదాన్ని అందించే చాన్స్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజు షూ ధరించి స్లేజ్‌పై డాన్స్‌ చేయాలి. ఆ సమయంలో ఎవరూ కూడా స్జేజీపై కూర్చోవడం కానీ, నిలబడటం కానీ చేయకూడదు. అలాగే మధ్య మధ్య మ్యూజిక్‌ ఆపేస్తానని.. అప్పుడు ఒకరు కిందకు దిగాలని కండీషన్‌ పెట్టాడు. అయితే ఎవర దిగిపోతారో ఇంటి సభ్యల ఇష్టమని చెప్పాడు. ఈ టాస్క్‌కు అఖిల్‌ని సంచాలకుడిగా నియమించాడు. కిందికి ఎవరి దించాలో అఖిల్‌ కూడా సూచించవచ్చని బిగ్‌బాస్‌ చెప్పాడు. చివరి వరకు స్టేజీపై ఎవరు ఉంటారో వారికి గోల్డెన్‌ మైక్‌ లభిస్తుందని చెప్పాడు.

అయ్యో అభి.. చూసుకోవాలిగా
దీంటో భాగంగా ఇంటి సభ్యులంతా తక్కువ సైజ్‌ గల షూ ధరించి డాన్స్‌ చేశారు. మొదటి సారి మ్యూజిక్‌ ఆపేయగా.. అఖిల్‌ పాటు మిగతా ఇంటి సభ్యులంతా అరియానాను దిగాల్సిందిగా కోరారు. ఆమెకు ఇదివరకే రెండు సార్లు ప్రేక్షకులతో మాట్లాడే చాన్స్‌ వచ్చిందని, ఈ సారి మిగతా వారికి అవకాశం ఇవ్వాలన్నారు. అయితే ఇక్కడ అరియానా కొంచెం అతి చేసింది. తాను దిగేందుకు సిద్దంగా ఉన్నానంటునే ఇప్పుడు మాత్రం దిగనని, రెండోసారి దిగుతానని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు ఎవరు దిగుతారని అభిజిత్‌ ప్రశ్నించగా.. సోహైల్‌ కూడా ప్రేక్షకులకు రిక్వెస్ట్‌ చేసే చాన్స్‌ వచ్చింది కదా.. ఆయన్ని దిగమని చెప్పింది. ఇప్పుడు నువ్వు ఎందుకు దిగవని చెబితే.. నాకు డాన్స్‌ చేయాలని ఉందని, ఏవోవో చెప్పుకొచ్చింది. ఇక అరియానా ఇప్పట్లో ఒప్పుకునేలా లేదనుకున్న అభిజిత్‌.. టాస్క్‌ కండీషన్‌ మర్చిపోయి కింద కూర్చున్నాడు. ఈ విషయాన్ని మోనాల్‌ గుర్తు చేసింది. దీంతో మొదటి సారి మన తెలివైనోడు.. తనకు ఈ విషయం తెలియదని, పొరపాటు జరిగిపోయిందంటూ స్టేజీ దిగేశాడు. ఇక అభి మొదటి సారి టాస్క్‌ కండీషన్స్‌ మర్చిపోవడంతో ఇంటి సభ్యులు అంతా అవాక్కయ్యారు. సోహైల్‌ అయితే.. ఏంటి అభి.. ప్రతిసారి టాస్క్‌ పేపర్‌ క్షుణ్ణంగా చదువుతావు.. ఈ సారి ఏమైంది చూసుకోవాలి కదా..అని నవ్వుతూ అభిపై సెటైర్లు వేశాడు.

అందుకే దిగుతున్నా : అరియానా
 ఇక రెండో సారి మ్యూజిక్‌ ఆగినప్పుడు అరియానా దిగుతూ..తనకు ఇప్పటికే రెండు సార్లు ప్రేక్షకులకు రిక్వెస్ట్‌ చేసుకునే చాన్స్‌ వచ్చిందని, మిగతవారికి కూడా రావాలనే స్టేజీ దిగుతున్నానని చెప్పి దిగిపోయింది. అలా మూడో సారి సోహైల్‌ దిగిపోయాడు. తానకు డాన్స్‌ చేయాలని ఉందని, కేవలం హౌస్‌మేట్స్‌ కోసమే కిందికి దిగుతున్నానని చెప్పాడు. అనంతరం వాష్‌రూమ్‌ దగ్గరకు వెళ్లి అరియానాపై బిగ్‌బాస్‌కు కంప్లైంట్‌ ఇచ్చాడు. ఇదివరకు జరిగిన టాస్క్‌లో ఇంటి సభ్యుల కోసం త్యాగం చేయమంటే చేయని అరియానా ఇప్పుడు ఎందుకు ఇచ్చిందని తప్పుపట్టాడు.
 

మోనాల్‌ రుణం తీర్చుకున్న హారిక
ఇక స్టేజీపై చివరకు హారిక, మోనాల్‌ మాత్రమే మిగిలి ఉన్నారు.ఇద్దరిలో ఒకరు దిగాల్సిరావడంతో.. హారికను దిగాల్సిందిగా మోనాల్‌ రిక్వెస్ట్‌ చేసింది. ఒక టాస్క్‌లో లాస్ట్‌ వరకు ఉండటం ఇది రెండో సారి అని, ఈ చాన్స్‌ తనకు చాలా ముఖ్యమని హారికను రిక్వెస్ట్‌ చేసింది. ఒక్కనిమిషం ఆలోచించిన హారిక.. చివరకు గోల్డెన్‌ మైక్‌ను మోనాల్‌కు త్యాగం చేసింది. కెప్టెన్సీ టాస్క్‌లో తనను భుజాలపై ఎత్తుకొని గెలిపించావని, అందుకే ఇప్పుడు నేను ఈ చాన్స్‌ ఇస్తున్నా అని హారిక చెప్పి దిగిపోయింది. ఇక టాస్క్‌ గెలిచి గొల్డెన్‌ మైక్‌ సాధించిన మోనాల్‌.. కన్ఫెషన్‌ రూమ్‌కి వెళ్లి ఓట్లు వేయమని ప్రేక్షకులను రిక్వెస్ట్‌ చేసింది. అనంతరం గార్డెన్‌ ఏరియాకు వచ్చి సంతోషంతో బిగ్‌బాస్‌కు హగ్‌లు, ఫ్లైకింగ్‌ కిస్‌లు ఇచ్చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement