బిగ్‌బాస్‌ : అభిజిత్‌కి జైలు శిక్ష.. నెంబర్‌ వన్‌ అతనే! | Bigg Boss 4 Telugu: Number Game Start Abhijeet Sent To Jail | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : అభిజిత్‌కి జైలు శిక్ష..నెంబర్‌ వన్‌ అతనే!

Published Fri, Dec 4 2020 7:47 PM | Last Updated on Fri, Dec 4 2020 7:47 PM

Bigg Boss 4 Telugu: Number Game Start Abhijeet Sent To Jail - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో గత సీజన్ల మాదిరే ఈ సారి కూడా నెంబర్‌ గేమ్‌ టాస్క్‌ మొదలైంది. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్‌లో నెంబర్ గేమ్‌ నిర్వహించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే తెలుస్తోంది. దీని ప్రకారం.. ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఏడుగురిలో ఆరుగురు సభ్యులు తాము ఏ స్థానానికి అర్హులమో చెప్పి.. ఆ నెంబర్ ముందు నిల్చోవాల్సి ఉంటుంది. దీంట్లో భాగంగా అఖిల్‌, సోహైల్‌ మొదటి స్థానంలో నిలబడినట్లు ప్రోమోలో చూపించినప్పటికీ టికెట్‌ టు ఫినాలే గెలిచినందుకు అఖిల్‌ను ఈ టాస్క్‌ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది. దీంతో సోహైల్‌ ఒక్కడే మొదటి స్థానంలో నిలబడ్డాడని టాక్‌. ఇక రెండో స్థానంలో అరియానా నిలబడింది.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఫినాలేకు అతిథిగా స్టార్‌ హీరో!)

 ఇక, మూడు నాలుగు స్థానాల్లో హారిక, మోనాల్ నిలిచారు. ఐదో స్థానంలో అవినాష్ ఉండగా, చిట్ట చివరన అభిజీత్ ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ టాస్క్‌లో గొడవ కంటే ఎక్కువగా ఎమోషనల్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరం ఇక్కడ ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా గ్రిల్‌ అయిపోయాం బిగ్‌బాస్‌ అని అరియానా అనగా.. ఇందాకే బిగ్‌బాస్‌ అందరం కలిసి హగ్‌ చేసుకున్నాం అని సోహైల్‌ కంటతడి పెట్టాడు. ఇదిలా ఉంటే బయట భారీ స్థాయిలో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న అభిజిత్‌.. ఆరోస్థానంలో నిలబడటం అందరిని అశ్చర్యపరిచింది.  గత నాలుగు వారాల క్రితం బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లో ఇంటి సభ్యులంతా అభిజిత్‌కి నెంబర్‌ వన్‌ ర్యాంకు ఇచ్చారు. ఇప్పుడేమోఅందరి కంటే చివరి స్థానం ఇవ్వడం అభిజిత్‌కి అవమానమనే చెప్పాలి. ఇక నెంబర్‌ గేమ్‌లో అభికి చివరి ర్యాంకు రావడంతో అతనికి జైలు శిక్ష పడినట్లు లీకుల వీరులు చెబుతున్నారు. ఇదే గనుక జరిగితే అభిజిత్‌కి మరింత సానుభూతి కలిసిరావడం ఖాయం. అయితే అభి జైలుకెళ్లడం ఒట్టి పుకారేనా లేదా నిజమా తెలియాలంటే ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ చూడాల్సిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement