బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో టికెట్ టు ఫినాలే గెలిచిన అఖిల్ నేరుగా ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో అతడు మినహా మిగతా ఐదుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఎంటర్‌టైన్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకోండని బిగ్‌బాస్ వీళ్లకు వరుస టాస్కులు ఇస్తున్నాడు. వాటిని ఎలాగైనా గెలవాలన్న కసితో కంటెస్టెంట్లు ఆడుతున్నారు. ఇప్పటికే అధికారం టాస్కులో అరియానా, ఓపిక టాస్కులో సోహైల్ గెలిచి.. ప్రేక్షకులను ఓట్లేయమని అభ్యర్థించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. ఈ క్రమంలో బిగ్‌బాస్ ఏకాగ్రత అనే మరో టాస్క్ ఇచ్చాడు. ఇందులో కంటెస్టెంట్లు ఏదైనా పని చేస్తూ 30 నిమిషాలు లెక్కపెట్టాల్సి ఉంటుంది. మిగతావాళ్లు ఆ వ్యక్తిని డిస్టర్బ్ చేయొచ్చు. ఈ క్రమంలో అభిజిత్ తనలోని కామెడీ టైమింగ్‌ను బయట పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. (బొమ్మ లొల్లి: శోకాలు పెట్టిన టామ్ అండ్ జెర్రీ)
ఇందులో టాస్క్ పూర్తి చేయడంలో మునిగిపోయిన సోహైల్‌ను నీకు బాగా నచ్చిన పనేంటని అభి ప్రశ్నించగా అతడు క్షణం ఆలోచించకుండా నినిద్ర పోవవడం అని సమాధానమిచ్చాడు. తర్వాత హారిక.. ఇక్కడున్నవాళ్లలో ఎవరిని శివగామితో పోలుస్తావు? అని అడగ్గా అభి తెలివిగా సమాధానమిచ్చాడు. శివగామిలో ఉన్న అందం మోనాల్‌కు ఉంది, శివగామిలో ఉన్న టెర్రర్ అరియానాకు ఉంది. శివగామిలో ఉన్న ప్రేమ హారికకు ఉంది అని చాలా క్లారిటీగా చెప్పాడు. ఇక టాస్క్ చేస్తున్న మోనాల్‌ను అభి.. ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉందని ప్రశ్నించగా.. ఆమె నవ్వుతూ భారత్-చైనా సరిహద్దులో ఉందని చెప్పింది. ఈ సమాధానం విని షాక్ అయిన అభి ఉన్నచోటే కింద పడిపోయాడు. మొత్తానికి రెండు రోజులుగా గొడవలతో వేడెక్కిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో అభి తన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పంచనున్నట్లు తెలుస్తోంది. (బిగ్‌బాస్ విన్నర్ అభిజితే: శ‌్రీకాంత్)
Comments
Please login to add a commentAdd a comment