
ఇప్పుడు కానీ బిగ్‌బాస్ కళ్లు చల్లారవు.. ఈ మాట అంటోంది మేము కాదు, నెటిజన్లు.. ఎందుకో ఈ స్టోరీ చదివితే మీకే అర్థమవుతుంది.,.. ఈ సీజన్‌లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆక్రమించింది మోనాల్, అఖిల్, అభిజిత్. బిగ్‌బాస్ ఫస్టాఫ్ అంతా ఆమె కోసం ఈ ఇద్దరూ కొట్టుకోవడంతోనే సరిపోయింది. వాళ్లిద్దరి మధ్య ప్రత్యేకించి గొడవలు లేకపోయినా మోనాల్ వల్ల శత్రువులుగా మారిపోయారు. ఆ తర్వాత అభి.. మోనాల్‌కు దూరమవడం, ఆమె అఖిల్‌కు మరింత దగ్గరవడం జరిగింది. అయితే అనూహ్యంగా అఖిల్ కూడా మోనాల్‌ను పక్కన పెట్టేసి అభిజిత్‌కు దగ్గరయ్యాడు. అతడితో స్నేహ గీతం పాడాడు. దీంతో గొడవలు జరిగేందుకు ఆస్కారం లేకుండా పోయింది. కానీ అందరికీ షాకిస్తూ తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటూ అఖిల్ అభిజిత్‌ను నామినేట్ చేశాడు. తర్వాత చాక్లెట్ ఇచ్చి కూల్ చేశాడు. అయిపోయింది. ఇక్కడ కూడా ఎలాంటి గొడవా లేదు, గందరగోళం లేదు.
ఇది బిగ్‌బాస్‌కు బొత్తిగా నచ్చనట్లుంది. అందుకే మరో ప్లాన్ వేశాడు. అఖిల్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపించి అతడికి అభికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చిచ్చు పెట్టనున్నాడు. అభి అభిప్రాయాలన్నింటినీ అఖిల్ చెవిన వేస్తున్నాడు. అసలే ఎవరి మాటతోనూ ఏకీభవించని అఖిల్ అభి వ్యాఖ్యలకు సీక్రెట్ రూమ్‌నుంచే కౌంటరిస్తున్నాడు. ఈ మేరకు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో అభి ఈ వారం రద్దైన కెప్టెన్సీ టాస్క్ మీద మరోసారి చర్చ లేవనెత్తాడు. ఒక వారం ఇమ్యూనిటీ కోసం ఇంత కొట్లాడిన వాడు సడన్‌గా పంపించేస్తే ఎందుకు ఊరుకున్నాడని సందేహిస్తున్నాడు. అంటే ఇదంతా ఫేకే కదా! ఎలాగో మళ్లీ హౌస్‌లోకి పంపిస్తారులే అన్న నమ్మకమే కదా! అని వాదించాడు. దీనికి అఖిల్.. నీ అంత కాన్ఫిడెన్స్ మాకు లేదయ్యా అని సీక్రెట్ రూమ్‌లో నుంచి ఉన్నమాట చెప్పాడు. (చదవండి: నేను ఆడటానికి రాలేదు, జస్ట్ ఎక్స్‌పీరియన్స్ కోసం..)
ఒకవేళ నిజంగా పంపించలేకపోతే ఎంత భయంగా ఉంటుంది? అని అభి అనగా నీకు కావాల్సింది కూడా అదేగా అని అఖిల్ కౌంటరిచ్చాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు మీరిద్దరూ మనసులో ఏదో పెట్టుకుని బయటకు మాత్రం కలిసి ఉంటూ ఫేక్ ఎమోషన్స్ ప్రదర్శించకండని హితవు పలుకుతున్నారు. అభిజిత్.. అఖిల్‌కోసం పాజిటివ్‌గానే మాట్లాడుతున్నారని అతని అభిమానులు అభిని సమర్థించుకుంటున్నారు. అఖిల్ స్నేహితుల దగ్గరే అతడి గురించి తప్పులు తీస్తూ మాట్లాడటం ఏంటని అఖిల్ అభిమానులు మండిపడుతున్నారు. ఏదేమైనా కలిశారు అనుకున్న అఖిల్, అభిజిత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితిని బిగ్‌బాస్ కావాలని క్రియేట్ చేస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎపిసోడ్‌తో అభి, అఖిల్ మధ్య పుల్లలు పెట్టే మిషన్‌ను బిగ్‌బాస్ విజయవంతంగా పూర్తి చేయనున్నాడని చెప్తున్నారు. (చదవండి: బిగ్‌బాస్: అభిజిత్ రూటులో అఖిల్?)
Comments
Please login to add a commentAdd a comment