బిగ్‌బాస్ నాల్గో సీజన్ పదోవారం ముగింపుకు వచ్చింది. ఇప్పటికే పది మంది షో నుంచి నిష్క్రమించగా ఇంకా తొమ్మిది మంది కంటెస్టెంట్లు హౌస్‌లో ఉన్నారు. వీరిలో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉంది? ఎవరికి అభిమాన గణం మెండుగా ఉంది? అన్న ప్రశ్న వస్తే క్షణం ఆలస్యం చేయకుండా అభిజిత్ అని టక్కున చెప్పేస్తారు. అవును మరి, షో ప్రారంభమైనప్పటి నుంచే అభిజిత్ కోసం ఆర్మీలు పుట్టుకొచ్చాయి. అతడేం చేసినా వెనకేసుకు రావడం, హౌస్‌లో అతడికి ఎవరు యాంటీగా ప్రవర్తిస్తే వారిని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి. ముఖ్యంగా అభితో వైరం పెట్టుకున్న అఖిల్‌ను ఇప్పటికీ ఆడుకుంటూనే ఉన్నాయి
తన గేమ్ తనిష్టం, అరియానా విషయంలో మాత్రం
ఇదిలా వుంటే బిగ్‌బాస్ ప్రయాణం తుది దశకు చేరుకుంటోంది. అయినా కంటెస్టెంట్లు సిల్లీ రీజన్స్ చెప్తూ ఇతరులను నామినేట్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అరియానా ఆట తీరు బాగోలేదని చెప్తూ అభిజిత్ ఆమెను నామినేట్ చేశాడు. అక్కడితో ఆగకుండా ఎలా ఆడాలో ఆమెకు వివరిస్తూ, కొన్ని గెలవాలి, మరికొన్ని ఓడిపోవాలని ఉపదేశించాడు. అయితే అఖిల్ కూడా గేమ్ గురించే అభిజిత్‌ను నామినేట్ చేశాడు. ఇమ్యూనిటీ టాస్క్‌లో అందరి కన్నా ముందే తనవల్ల కాదని చేతులెత్తేయడం కరెక్ట్ కాదని అఖిల్ చెప్పాడు. కానీ అభి మాత్రం అందుకు ఏకీభవించకపోవడం గమనార్హం. అది తనిష్టమని, అవసరమైతే ఇంటికి పోతా, నీకెందుకు మధ్యలో అని మొహం మీదే చెప్పాడు. (నీ కాళ్లు పట్టుకుంటా, ఏం చేసుకోకు: అరియానా కన్నీళ్లు)
గేమ్ ఆడటానికి రాలేదు, ఎక్స్‌పీరియన్స్ కోసమే
తను గేమ్ ఆడటానికి రాలేదని, కేవలం ఎక్స్‌పీరియన్స్ కోసం వచ్చానని కూడా మరోసారి స్పష్టం చేశాడు. అంటే టైటిల్ విన్నర్ అవ్వాలన్న ఆశ, పట్టుదల అభిలో ఏమాత్రం కనిపించడం లేదు. కానీ బయట ఆయన అభిమానులు మాత్రం అభిజితే విన్నర్ అవుతాడని బల్లగుద్ది చెప్తున్నారు. పోనీ అభికి విన్నర్ అవ్వాలని ఆశలు లేకపోయినా అతడి పర్ఫామెన్స్ వల్ల గెలిచే అవకాశాలున్నాయా? అంటే అదీ లేదు. రోబో టాస్క్ మినహా మరేదీ తాను గొప్పగా ఆడింది లేదని స్వయంగా అభిజితే అంగీకరించాడు. ఫిజికల్ టాస్కులోనూ బుర్ర ఉపయోగించడానికి ప్రయత్నిస్తాడే కానీ బాడీని వాడడు. ఇలా బద్ధకంగా కనిపించే అభి ఎమోషన్స్‌ను నియంత్రణలో ఉంచుకోవడంలో దిట్ట. తను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాడు. ఇలాంటి క్వాలిటీసే అతడిని టాప్ 5కి తీసుకెళ్తున్నాయి. కానీ గెలుపు మాత్రం ఆయన చేతిలోనే ఉంది. (అప్పులున్నాయి, ప్లీజ్ సపోర్ట్: అవినాష్ సింపథీ గేమ్?)
టాప్ 5లో ఉండేదెవరు?
షో ముగియడానికి ఇంకా నాలుగు వారాలు మాత్రమే ఉంది. ఎవరికి టైటిల్ గెలిచే అర్హత ఉందో తెలుసుకునేందుకు బిగ్‌బాస్ రానున్న రోజుల్లో ఇంకా కఠినతరమైన టాస్కులు ప్రవేశపెడతాడు. అప్పటికి కూడా చూస్తాను కానీ చేయనని వెనకడుగు వేస్తే మాత్రం అభిజిత్ రన్నరప్‌గా కూడా నిలవలేడు. అలా కాకుండా అతడికి బుద్ధిబలంతో పాటు కండబలం తోడైతే మాత్రం విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో విన్నర్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు మొదలెట్టేశారు. కనీసం ఎంటర్‌టైన్ చేయకుండా, టాస్కులు ఆడకుండా ఉండే అభి విన్నర్ కాలేడని కొందరు వాదిస్తున్నారు. అయినా సరే ఓట్లు పడుతున్నాయ కదా అని పర్ఫామెన్స్‌ను పక్కన పెట్టి అతడికి కిరీటం తొడిగితే మాత్రం బిగ్‌బాస్ హిస్టరీలోనే ఇది పెద్ద తప్పుగా నిలిచిపోతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే టాప్ 5లో అభితో పాటు అఖిల్, అవినాష్, సోహైల్, లాస్య ఉండే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment