అప్పుడెప్పుడో సినిమాలో తళుక్కున మెరిసి మాయమైపోయిన హీరో అభిజిత్. ఇప్పుడు బిగ్‌బాస్ షో ద్వారా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. గొడవలకు దూరంగా ఉంటూ సహనంతో తన ప్రయాణాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే అభిజిత్ చెప్పే మాటలకు, అతని ఆట తీరుకు అసలు పొంతన లేకుండా పోతోంది. అయినా సరే నామినేషన్‌లోకి వచ్చిన ప్రతిసారి అతడికి బీభత్సంగా ఓట్లు గుద్దేస్తున్నారు. అతడి పర్ఫామెన్స్ ఆ రేంజ్‌లో ఉందా? అంటే అదీ లేదు. బ్రెయిన్ గేమ్‌లో అభిజిత్ దిట్ట అనే విషయం రోబో టాస్కులో బయటపడింది. కానీ హోటల్ టాస్కులో కూడా అదే బ్రెయిన్ గేమ్ ఆడి బోల్తా కొట్టాడు. ఇక ఫిజికల్ టాస్కులో అలాంటి ఆలోచనలు చేయడానికి ఛాన్సే ఉండదు. తాడోపేడో తేల్చుకుందామనే రీతిలో ఆడి తీరాల్సిందే. కానీ అభిజిత్ మాత్రం మొదటి నుంచి ఫిజికల్ టాస్క్‌కు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నాడు. (చదవండి: బిట్టూ అని వాళ్లే పిలవమన్నారు: సుజాత)
నిన్నటి "రేసర్ ఆఫ్ ది హౌస్" అనే ఫిజికల్ టాస్క్‌లో కూడా అభిజిత్ ఎక్కువ సేపు పుషప్స్ చేయలేక మొదటి రౌండ్‌లోనే ఓడిపోయాడు. దీంతో రెండో రౌండ్‌కు సంచాలకుడిగా వ్యవహరించాడు. మొన్నటి బిగ్‌బాస్ డీల్స్‌లో తలకు మాస్కు ధరించి అరటిపండు తినాలంటే అతి తెలివి ప్రదర్శించాడు. సగం మాస్కు ధరించి తినబోయాడు. కానీ అది కుదరదని వారించడంతో అవినాష్ ఆ టాస్క్ పూర్తి చేశాడు. కాయిన్ల టాస్కులోనూ అంతంతమాత్రంగానే ఆడాడు. కాగా అభికి ఒక్కసారిగా క్రేజ్ తెచ్చి పెట్టిన టాస్క్ 'రోబో టాస్క్'. అతడు చెప్పిన దివి కిడ్నాప్ ప్లాన్ వర్కవుట్ అవడంతో అందరూ అతడిని మెచ్చుకున్నారు. కానీ ఆ తర్వాత అమ్మాయిలతో ముచ్చట్లు తప్పితే టాస్కుల్లో పెద్దగా ఆడింది లేదు. (చదవండి: హారిక అలకను హగ్గుతో పోగొట్టిన అభిజిత్)
సోహైల్ చెప్పినట్టుగా ఫిజికల్ టాస్కుల్లో అభి చాలా వీక్ అనే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో అతడి ఆటతీరుపై ఓ వర్గం నెటిజన్లు మండిపడుతున్నారు. ఫిజికల్ టాస్కులు ఆడటం అభికి చేతకాదని, టాస్కుల్లో అభి అన్‌ఫిట్ అంటూ విమర్శిస్తున్నారు. అమ్మాయిలతో పులిహోర కలపడం, హారికతో సోది ముచ్చట్లు పెట్టడం మాత్రం బాగా వచ్చని సెటైర్లు వేస్తున్నారు. కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం, మోనాల్ వ్యవహారంలో సైడ్ అయిపోవడం, కరెక్ట్ పాయింట్లు మాట్లాడటం వంటివి అతనికి మంచి పేరును తీసుకువస్తున్నాయి. కాస్త టాస్కుల పైన కూడా దృష్టి పెడితే ఆయన అభిమానులు కోరుకుంటున్నట్లు అభిజిత్ విన్నర్ అయ్యే అవకాశాలూ లేకపోలేదు. (చదవండి: అలాంటి అమ్మాయి ఇష్టం: అభిజిత్)
Comments
Please login to add a commentAdd a comment