
బిగ్‌బాస్ నాల్గో సీజన్ ప్రారంభమై 70 రోజులు దాటిపోయింది. ఈ సీజన్‌లో 16 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరికి తోడుగా మరో ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు లోనికి వెళ్లడంతో పార్టిసిపెంట్ల సంఖ్య 19కి చేరింది. కానీ పదకొండో వారానికి వచ్చేసరికి మాత్రం కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగిలారు. అయితే కంటెస్టెంట్లు లోనికి వెళ్లే ముందు 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే కదా! కరోనా కాలం కాబట్టి ఆ ముందు జాగ్రత్త చర్యలు తప్పలేవు. ఇదిలా వుంటే షో ముగింపుకు వస్తున్న తరుణంలో ఇంటిసభ్యులు వారి కుటుంబీకులను కలుసుకునేందుకు బిగ్‌బాస్ ప్లాన్ చేశాడు. కానీ కోవిడ్ కారణంగా ఒకరినొకరు టచ్ చేయడానికి కూడా వీలు లేకుండా అడ్డుగోడ కట్టారు. కుటంబ సభ్యులు వారి పిల్లలతో కలిసి తిరగకుండా ఓ గాజు తెరలో నుంచే మాట్లాడే సదుపాయం కల్పించారు. (చదవండి: నేను స్ట్రాంగ్ కాదు, పంపించేయండి: అరియానా)
దీంతో నేడు హౌస్‌లోకి అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక, అరియానా తల్లులు వచ్చారు. వాళ్లను చూసి సర్‌ప్రైజ్ అయిన ఇంటిసభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి కన్నీళ్లు తుడిచే అవకాశం లేకపోయినా మాటలతో ఓదార్చుతూ అద్దంలో నుంచే తమ పిల్లలకు మమకారపు ముద్దులు కురిపిస్తూ ఓదార్చారు. కాగా ఎన్ని గొడవలు జరిగినా కేవలం గేమ్ వరకే అని అవినాష్ చెప్తుంటే అభిజిత్ అమ్మ మాత్రం కొట్టుకోండి, మజా వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. అఖిల్ తల్లి మాట్లాడుతూ హారిక లాంటి కూతురు కావాలని దేత్తడి మీద ప్రేమ కురిపించింది. అవినాష్ లాగే అతడి తల్లి కూడా డ్యాన్సు చేస్తూ ఎంటర్‌టైన్ చేసింది. ఇక హారిక అమ్మ మాట్లాడుతూ.. ఈసారైనా కెప్టెన్ అవుతావా? అని కూతురిని ఏడిపించింది. కుటుంబ సభ్యులను కలుసుకున్న కంటెస్టెంట్లు ఆనందంతో గాల్లో తేలియాడుతున్నారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఈ ఎమోషనల్ ఎపిసోడ్ వీక్షించాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే! (చదవండి: అవమానాలను గెలుపుగా మార్చుకున్న దేత్తడి)

Comments
Please login to add a commentAdd a comment