బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌లో ఇచ్చిన "ఉక్కు హృదయం" టాస్క్ వల్ల హౌస్ ఎంత రసాభాసగా మారిందో తెలిసిందే కదా. అయితే ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు బలమైన వారని తెలిసి అభిజిత్ బుద్ధికి పని చెప్పాడు. కిడ్నాప్ ప్లాన్ రచించగా, అది వీర లెవల్లో సక్సెస్ అయింది. ఊహించని దెబ్బకు మనుషుల టీమ్ గిలగిలా కొట్టుకున్నారు. నమ్మకద్రోహం అంటూ అభిజిత్‌పై పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. ఈ క్రమంలో తనను ఎన్ని మాటలన్నా, పరుష పదజాలం ఉపయోగించినా అభి సహనాన్ని కోల్పోలేదు. అంత కోపమొంటే నామినేట్ చేయండి అని సింపుల్‌గా గొడవకు ముగింపు పలికాడు. ఇది జనాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ తను మాత్రం ఏమీ ఆశ్చర్యపోలేదంటున్నాడు యాంకర్ రవి. ఇతడు అభిజిత్‌కు బంధువు అవుతాడు. (చదవండి: వర్కవుట్ అయిన కిడ్నాప్; నాకిది అగ్ని పరీక్ష)
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ.. "నేను బిగ్‌బాస్ ప్రోమోలు చూస్తున్నాను. గేమ్‌లో పరిస్థితిని అంచనా వేసి అప్పటికప్పుడు అభిజిత్ కిడ్నాప్ ప్లాన్ చేయడం ప్రశంసనీయం. పైగా అందరూ అతడిపై అరుస్తున్నా సహనంగా ఉన్నాడు. అది చూసి నేనేమీ షాక్ అవలేదు. ఎందుకంటే అతడిలో నాకు ఎమ్ఎస్ ధోనీ కనిపిస్తున్నాడు. అభి.. ఏదైనా గొడవ జరిగితే తిరిగి అరవడం బదులు కూర్చుని మాట్లాడుకుందాం అనే టైపు. అతడు రియల్ లైఫ్‌లో కూడా ఇలానే ఉంటాడు. చాలా సైలెంట్. అవసరమైతేనే మాట్లాడతాడు. ఓ ఫంక్షన్‌లో మేము మాస్ డ్యాన్స్ చేస్తున్నాం. అక్కడే ఉన్న అభిని డ్యాన్స్ చేయమని పిలిచాం. కానీ అతను సాల్సా వంటి పాటలకైతేనే స్టెప్పులేస్తానన్నాడు. కానీ అభి ఒక్కసారి నమ్మాడంటే అది ఏదైనా సరే విడిచిపెట్టడు. అతడు తప్పకుండా టాప్ 3లో ఉంటాడు. కానీ రేపు పొద్దున ఏదైనా తప్పు చేస్తే మొదట నేనే అతడిని విమర్శిస్తా" అని చెప్పుకొచ్చాడు. (చదవండి: ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..)
Comments
Please login to add a commentAdd a comment