
బయట జనాలొకటి తలుస్తుంటే లోపల కంటెస్టెంట్లు మరోలా ఆలోచిస్తున్నారు. నిన్న బిగ్‌బాస్ ఇంట్లోవాళ్లను ఎవరికి వారు ర్యాంకింగ్స్ ఇచ్చుకోమని చెప్పగానే అందరూ మొదటి స్థానాల వైపు కన్నేస్తే అభిజిత్ మాత్రం నేరుగా వెళ్లి ఆరో స్థానంలో నిలబడ్డాడు. మొదటి నుంచి అన్ని టాస్కుల్లో వంద శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న తాను జలజ దెయ్యం ఇచ్చిన మోనాల్‌తో డేటింగ్ అనే టాస్కు మాత్రం చేయలేదని తన తప్పును ప్రస్తావించాడు. ఆ ఒక్క పొరపాటు కారణంగా వరస్ట్ పర్ఫార్మర్‌గా నిలిచేందుకు సిద్ధమేనని చెప్పాడు. దీంతో బిగ్‌బాస్ అభిని వరస్ట్ పెర్ఫార్మర్‌గా ప్రకటించి జైలుకు పంపాడు.
కంటెస్టెంట్లను వేధిస్తున్న అనారోగ్యం..
అయితే నేడు అతడి జైలు శిక్ష పూర్తి కానుందట. అలాగే హౌస్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్కు జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో అభి స్విమ్మింగ్ పూల్ దగ్గర టాస్కు చేస్తున్న క్రమంలో గాయాలపాలయ్యాడట. అతడి చేతికి, కాలికి స్వల్ప గాయమైందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ఈ సీజన్‌లో కంటెస్టెంట్లను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గంగవ్వ, నోయల్ అనారోగ్యం కారణంగా హౌస్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. మధ్యలో అవినాష్ కూడా కాలు బెణికి కొంత ఇబ్బంది పడ్డాడు. (చదవండి: బిగ్‌బాస్ : వరస్ట్ పెర్ఫార్మర్‌గా అభిజిత్.. జైలు శిక్ష)
భుజాల నొప్పి వేధిస్తున్నా..
ఇక అభిజిత్ విషయానికివస్తే గతంలో అతడి భుజానికి గాయమైందని ఆమె తల్లి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అందువల్లే టాస్కులు సరిగా ఆడలేకపోతున్నాడని క్లారిటీ ఇచ్చింది. కానీ అభి మాత్రం ఈ విషయాన్ని ఎప్పుడూ షోలో వెల్లడించడానికి ఇష్టపడలేదు. పైగా రోబో టాస్క్ మినహా అభి ఇతర టాస్కులు పెద్దగా ఆడింది లేదని మిగతా ఇంటి సభ్యులు అతడిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో కసితో రగిలిపోయిన అతడు కమాండో ఇన్‌స్టిట్యూట్ గేమ్‌లో ఫిజికల్ టాస్కు ఆడి స్టార్ సంపాదించాడు. కెప్టెన్సీ పోటీదారునిగా ఎంపికయ్యాడు, కానీ కెప్టెన్ కాలేకపోయాడు. 'రేస్ టు ఫినాలే' టాస్క్‌లో సైతం తనవంతు అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఇలా టాస్కుల్లోనూ విజృంభిస్తున్న తరుణంలో అభికి గాయాలు కావడం ఆయన అభిమానులను కలవరపరుస్తోంది. అయితే అతడికి చిన్నచిన్న గాయాలే అయ్యాయంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమనేది నేటి ఎపిసోడ్‌లో చూడాలి. (చదవండి: బిగ్‌బాస్‌లో పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్)
Comments
Please login to add a commentAdd a comment