బిగ్‌బాస్ ట్రోఫీ గెలుచుకునేందుకు కంటెస్టెంట్లు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడొక లెక్క అన్నట్లుగా తమ బుద్ధిబలానికి, శక్తిసామర్థ్యాలకు ఏకకాలంలో పని చెప్తున్నారు. ఇలాంటి సమయంలో నామినేషన్స్ అనేవే లేకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లేందుకు బిగ్‌బాస్ ఫినాలే మెడల్ ప్రవేశపెట్టాడు. దీన్ని చేజిక్కించుకునేందుకు ఇంటి సభ్యులు ఒకరికొకరు ఏమాత్రం తక్కువ కాదనేలా ప్రాణం పెట్టి పోరాడారు. కానీ నలుగురు మాత్రమే లెవల్ 2కు అర్హత సాధించారు. మరి నేటి 87వ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఏమేం జరిగాయో తెలియాలంటే ఈ స్టోరీని చదివేయండి..
మోనాల్‌తో మనసు పెట్టి ఆడా: అఖిల్
నామినేషన్ షాక్ నుంచి తేరుకోలేని అఖిల్ ఫ్యామిలీ ఫొటో చూసుకుంటూ ఏడ్చేశాడు. తర్వాత మోనాల్ అతడికి సారీ చెప్పే ప్రయత్నం చేయగా నీతో మాట్లాడమే వద్దని దండం పెడుతూ తెగతెంపులు చేసుకున్నాడు. ఆమె మనసు పెట్టి ఆడుతుందట నేను మెదడుతో ఆడతానట. ఇంట్లో అందరితో బ్రెయిన్ గేమ్ ఆడాను కానీ ఆమె దగ్గర మాత్రం మనసు పెట్టి ఆడాను అని సోహైల్ దగ్గర వాపోయాడు. ఈమెతో మనసు పెట్టి ఆడినందుకు నేను హౌలాగాడినా అని సీరియస్ అయ్యాడు. తన స్నేహితులిద్దరూ గొడవపడతుండటం సోహైల్‌కు ఏమాత్రం నచ్చలేదు. మోనాల్ కోసం సపోర్ట్‌గా నిలబడ్డాడు. ఆమె వీక్ వీక్ అని పదేపదే చెప్పే అవినాష్, అరియానా దగ్గరకు వెళ్లి మోనాల్ ఆడుతోందని నచ్చ జెప్పాడు.
తన్నింది నువ్వంటే నువ్వు...
అనంతరం 'రేస్ టు ఫినాలే'లో మొదటి లెవల్ ప్రారంభమైంది. ఇందులో ఎవరైతే ఎక్కువ పాల బాటిళ్లు నింపుతారో వారు తర్వాతి లెవల్‌కు అర్హత సాధిస్తారు. ఈ లెవల్‌లో గెలిచేందుకు ఎలాంటి పనులు చేస్తారనేది ఇంటిసభ్యుల ఇష్టానికే వదిలేశాడు. మొదటగా ఆవు అంబా అనగానే కంటెస్టెంట్లు పరుగెత్తుకుంటూ వెళ్లి పాలు పట్టుకున్నారు. ఈ గేమ్‌లో ఏమైనా చేసుకోవచ్చని ఏకంగా బిగ్‌బాసే చెప్పాడు కాబట్టి సోహైల్, అఖిల్ కలిసి ఆడుతూ మిగతావాళ్లకు పాలు దక్కకుండా చేశారు. ఇందులోనూ అఖిలే ఎక్కువ కష్టపడ్డట్లు కనిపించింది. ఇంతలో మోనాల్ తన్నిందని అవినాష్ గొడవ పడ్డాడు. నువ్వు కూడా నన్ను తన్నావంటూ సోహైల్ కాలి దెబ్బను చూపించాడు. (చదవండి: నాకొద్దు, ఎలిమినేట్ చేయండి: అవినాష్)
సాయం అడిగిన అరియానాపై చికాకు
అందరూ కలిసి తనకు దక్కకుండా పాలు పట్టుకుంటున్నారని అవినాష్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగతంగా కాకుండా టీమ్‌గా ఏర్పడి ఆడుతున్నారని అసహనంతో ఊగిపోయాడు. ఇంతలో అరియానా అందరూ సపోర్ట్ చేసుకుంటూ ఆడుతున్నారు కదా, నాకు చెయ్యవా అని నోరు తెరిచి అడగ్గా అతడు శివాలెత్తిపోయాడు. నా గేమ్ ఆడటానికి వచ్చా, సపోర్ట్ చేయడానికి రాలేదు అని కుండ బద్ధలు కొట్టి చెప్పడంతో ఆమె ముఖం మాడిపోయింది. అంతలోనే మళ్లీ తాను ఆడనని, ఎలిమినేట్ చేసి పారదొబ్బండి అంటూ హౌస్ లోపలకు వెళ్లి ఏడ్చేశాడు. దిక్కులు చూస్తూ ఎవరూ తనను చూడటం లేదని నిర్దారించుకున్నాక కిచెన్‌లోని పాలు, నీళ్లన్నింటినీ క్యాన్‌లో నింపుకోవడం ప్రారంభించాడు.
అవినాష్ చర్యతో అసలుకే ఎసరు
కానీ అతడి అతితెలివి నీళ్లపాలైంది. ఇంట్లోని పాలు, నీళ్లు నింపుకున్న కారణంగా అవినాష్ రేసు నుంచి అవుట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించాడు. తను రేసు నుంచి నిష్క్రమించడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. రేస్ టు ఫినాలే ఇలా పెడతారా? అని బిగ్‌బాస్ మీద అసహనం వ్యక్తం చేశాడు. తర్వాతి రౌండ్‌లో హారిక మొదట తనదగ్గర 14 బాటిళ్లు ఉన్నాయని చెప్పిందని, కానీ బిగ్‌బాస్‌కు మాత్రం 11 అని చెప్పడంతో అఖిల్‌కు అనుమానం వచ్చింది. బహుశా మిగతావి అభికి ఇచ్చి ఉండటమో లేదా లెక్క తప్పుగా చెప్పడమో జరిగి ఉంటుంది. (చదవండి: బిగ్‌బాస్: అభికి షాకుల మీద షాకులు)
ఫినాలేలో బెర్త్ కోసం ఏడ్చేసిన అరియానా
ఈ రౌండ్‌లో అరియానా అవుట్ అవడంతో ఆమె గుక్కపెట్టి ఏడ్చింది. ఫినాలేలో ఉంటానో ఉండనో అని భయమేస్తుందంటూ అవినాష్‌ను హత్తుకుని బాధపడింది. మూడో రౌండ్‌లో తక్కువ బాటిళ్లు నింపిన కారణంగా మోనాల్ నిష్క్రమించింది. దీంతో అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక రెండో లెవల్‌కు అర్హత సాధించారు. మరి వీరిలో ఎవరు ఫినాలే మెడల్ సొంతం చేసుకుంటారో చూడాలి. (చదవండి: ట్రయాంగిల్ స్టోరీపై లాస్య స్పందన)
Comments
Please login to add a commentAdd a comment