
బిగ్‌బాస్-4 సీజన్ ఆదివారంతో ముగిసింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో అభిజిత్ విన్నర్‌గా నిలిచాడు. అయితే, అభిజిత్‌కు దక్కాల్సిన ప్రైజ్ మనీ రూ.50 లక్షల్లో కోత పడింది. కంటెస్టెంట్లలో చివరగా అభిజిత్, అఖిల్, సోహైల్ మాత్రమే మిగలడంతో.. పోటీ నుంచి తప్పుకున్నవారికి రూ.25 లక్షలు ఇస్తామని చెప్పడంతో. బిగ్‌బాస్ ఆఫర్‌ను స్వీకరించిన సోహైల్ పక్కకు తప్పుకునున్నాడు. ఇక అఖిల్, అభిజిత్ ఫైనలిస్టులుగా మిగలగా.. అభిని ట్రోఫీ వరించింది. అయితే, అభి అభిమానులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే రూ.25 లక్షలు కట్ చేయడమేంటని ట్రోల్ చేస్తున్నారు. బిగ్‌బాస్ నిర్వాహకులు అభిమానుల్ని అవమానించారని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.
(చదవండి: సోహైల్, దివికి చిరు బంపర్ ఆఫర్!)
కష్టపడి ఓట్లేస్తే ఇంత చెత్తగా ఆలోచిస్తారా అని కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో మరోసారి బిగ్‌బాస్ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు. విన్నర్ అభిజిత్ రూ.25 లక్షలు మాత్రమే దక్కాయని, సెకండ్ రన్నరప్ సోహైల్‌కు అంతకన్నా ఎక్కువ మొత్తం, ఇంకా బెనిఫిట్స్ అందాయని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు మెహబూబ్‌కు మెగాస్టార్ చిరంజీవి రూ.10 లక్షల చెక్ ఇవ్వడం గొప్ప విషయమని చెప్తూనే.. మిగతా కంటెస్టెంట్లు అరియానా, అవినాష్, హారిక పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. హోస్ట్ నాగార్జున కూడా ఒకవైపే మొగ్గు చూపారని ఆరోపిస్తున్నారు. ఒకవేళ సోహైల్, అఖిల్.. అభిజిత్ కన్నా ఎక్కువ ఓట్లు సాధించి ఉంటే కూడా బిగ్‌బాస్ ఇలాగే ప్రైజ్ మనీలో కోత పెట్టేవారా అని ప్రశ్నిస్తున్నారు.
(చదవండి: బిగ్‌బాస్– 4 విజేత అభిజిత్)
Comments
Please login to add a commentAdd a comment