Big Boss Fame Mehaboob Clarifies About His Role in Acharya Movie - Sakshi
Sakshi News home page

ఆచార్య మూవీ టీం నుంచి కాల్‌ వచ్చింది.. కానీ!: మెహబూబ్‌

Published Mon, Aug 16 2021 3:08 PM | Last Updated on Mon, Aug 16 2021 3:22 PM

Bigg Boss Fame Mahabub Said He Got Call From Acharya Movie Team - Sakshi

ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్‌ షోతో కంటెస్టెంట్స్‌ అంతా ఒవర్‌నైట్‌ స్టార్‌ అయిపోతున్నారు. హౌజ్‌లో తమదైన తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతంగా చేసుకుని ఎంతో క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజ్‌తోనే వరుస ఆఫర్లు కొట్టెస్తున్నారు. గత సీజన్‌ 4 కంటెస్టెంట్‌ ఆరియాన గ్లోరీ రాత్రికిరాత్రే స్టార్‌ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. ఈక్రమంలో సినిమా ఛాన్స్‌లు కొట్టెసింది. అలాగే దివి ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్‌ దక్కించుకుంది. సోహైల్‌ కూడా హీరోగా బిజీ అయిపోయాడు.

ఇక మిగతా కంటెస్టెంట్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌లు, సొంతంగా యూట్యూబ్‌లు ఛానల్‌ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా మెహబూబ్‌ దిల్‌సేకి ఆచార్యలో నటించే ఆఫర్‌ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సింగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా మెహబూబ్‌ దీనిపై స్పందించాడు. తనకు ఆచార్య టీం నుంచి కాల్‌ వచ్చిందని, ఆఫీసుకు వెళ్లి కలిశాను అని చెప్పాడు. అక్కడ తన రోల్‌ ఎంటో వివరించారని, దానిపై కాసేపు చర్చ కూడా జరిగినట్లు తెలిపాడు. అయితే మళ్లీ తనకు ఫోన్‌ రాలేదని, ఒకవేళ కాల్‌ వస్తే కళ్లు మూసుకుని షూటింగ్‌లో పాల్గొంటానని పేర్కొన్నాడు. 

కాగా బిగ్‌బాస్‌ సీజన్‌-4 ఫైనల్‌ ఎపిసోడ్‌లో చిరు ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోహైల్‌, దివి, మెహబూబ్‌లకు చిరు బిగ్‌ ఆఫర్లు ఇచ్చాడు. సోహైల్‌ హీరోగా ఏ సినిమా చేసిన అందులో అతిథి పాత్రలో నటిస్తానని మాట ఇచ్చాడు. దివికి తన నెక్ట్‌ మూవీలో ఓ పాత్ర ఇస్తానని చెప్పాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement