mahabub ALi
-
ఆచార్య మూవీ టీం నుంచి కాల్ వచ్చింది.. కానీ!: మెహబూబ్
ప్రముఖ బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ షోతో కంటెస్టెంట్స్ అంతా ఒవర్‌నైట్ స్టార్ అయిపోతున్నారు. హౌజ్‌లో తమదైన తీరుతో ఎంతో మంది అభిమానులను సొంతంగా చేసుకుని ఎంతో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఆ క్రేజ్‌తోనే వరుస ఆఫర్లు కొట్టెస్తున్నారు. గత సీజన్ 4 కంటెస్టెంట్ ఆరియాన గ్లోరీ రాత్రికిరాత్రే స్టార్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈక్రమంలో సినిమా ఛాన్స్‌లు కొట్టెసింది. అలాగే దివి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. సోహైల్ కూడా హీరోగా బిజీ అయిపోయాడు. ఇక మిగతా కంటెస్టెంట్స్ కూడా వెబ్ సిరీస్‌లు, సొంతంగా యూట్యూబ్‌లు ఛానల్ పెట్టుకున్నారు. ఇదిలా ఉండగా మెహబూబ్ దిల్సేకి ఆచార్యలో నటించే ఆఫర్ వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సింగతి తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. తాజాగా మెహబూబ్ దీనిపై స్పందించాడు. తనకు ఆచార్య టీం నుంచి కాల్ వచ్చిందని, ఆఫీసుకు వెళ్లి కలిశాను అని చెప్పాడు. అక్కడ తన రోల్ ఎంటో వివరించారని, దానిపై కాసేపు చర్చ కూడా జరిగినట్లు తెలిపాడు. అయితే మళ్లీ తనకు ఫోన్ రాలేదని, ఒకవేళ కాల్ వస్తే కళ్లు మూసుకుని షూటింగ్లో పాల్గొంటానని పేర్కొన్నాడు. కాగా బిగ్‌బాస్ సీజన్-4 ఫైనల్ ఎపిసోడ్లో చిరు ముఖ్య అతిథిగా హజరైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో సోహైల్, దివి, మెహబూబ్‌లకు చిరు బిగ్ ఆఫర్లు ఇచ్చాడు. సోహైల్ హీరోగా ఏ సినిమా చేసిన అందులో అతిథి పాత్రలో నటిస్తానని మాట ఇచ్చాడు. దివికి తన నెక్ట్ మూవీలో ఓ పాత్ర ఇస్తానని చెప్పాడు. -
నాటి టౌన్‌హాల్.. మన అసెంబ్లీ భవనం
సాక్షి సిటీబ్యూరో: అది 1903, జనవరి 1.. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఢిల్లీలో దేశంలోని వివిధ సంస్థానాదీశుల దర్బార్‌కు వెళ్లి జనవరి 4వ తేదీన తిరిగి నగరానికి వచ్చారు. వస్తునే ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సభాస్థలికి (ప్రస్తుతం అసెంబ్లీ భవనం ఉన్న ప్రాంతం) చేరకుని ప్రసంగించారు. హైదరాబాద్ రాజ్యంలో తాను చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లో చేయదలచిన పనులను చెప్పారు. సంస్థానాధీశుల సమావేశంలోని విశేషాలను వివరించారు. ఆ క్షణంలోనే నగరవాసులంతా ఒక నిర్ణయానికి వచ్చారు. నిజాం నవాబు ఢిల్లీ దర్బార్ సభల్లో పాల్గొని వచ్చిన చారిత్రక సందర్భం.. ఈ సభా వేదిక చిరకాలం గుర్తుండి పోయేలా అద్భుతమైన భవనం కట్టించాలని తీర్మానించారు. ఆ కట్టడం కోసం అన్ని వర్గాల ప్రజలు పరిశ్రమించారు. చందాలు పోగుచేశారు. మరో ఏడాది తర్వాత.. మహబూబ్ అలీఖాన్ 40వ పుట్టిన రోజు సందర్భంగా 1905 ఆగస్టు 18న భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. 1913 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తయింది. కానీ మహబూబ్ అలీఖాన్ 1911లోనే మరణించారు. ఆయన తనయుడు ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఆ భవనం అందుబాటులోకి వచ్చింది. శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న ఆ నిర్మాణాన్ని మహబూబ్ జ్ఞాపకార్థం ‘మహబూబియా టౌన్‌హాల్’æగా నామకరణం చేశారు. తర్వాత కాలంలో రాష్ట్ర శాసనసభగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశం సందర్భంగా ఆ భవనంపై ‘సాక్షి’ ప్రత్యే కథనం.. కుతుబ్‌షాహీ పాలకుల నుంచి ఆసిఫ్‌జాహీ పాలకుల వరకు హైదరాబాద్ సంస్థానంలో ప్రజా సౌకర్యార్థం వందల కట్టడాలు నిర్మించారు. కానీ ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ కట్టడానిది మాత్రం భిన్న చరిత్ర. ప్రజా అవసరాల కోసం ఈ భవనాన్ని నగర ప్రజలు చందాలతో నిర్మించారు. దీని నిర్మాణంలో డబ్బులు దానం చేసే వారు ఒక రూపాయి కంటే ఎక్కువ ఇవ్వరాదని ఫర్మానా జారీ చేశారు. దీంతో నగర సాధారణ ప్రజలు కూడా అర్ధణా, అణా, రెండు అణాలు చొప్పున ఇచ్చారని చరిత్రకారులు చెబుతారు. అలా మొత్తం రూ.20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని కట్టించారు. అద్భుతమైన నిర్మాణ శైలి నూరేళ్లకు పైగా కాలానికి సాక్షిగా నిలిచిన ఈ భవనంలో ఎందరెందరో రాజనీతిజ్ఞులు, విధాన రూపకర్తలు, ప్రజ సమస్యలపై ఎలుగెత్తిన రాజకీయ నాయకులు, ప్రజా జీవితంలో తలపండిన నేతలు ఆ భవనంలో కొలువుదీరారు. శాసనాల రూపకల?నలో భాగస్వాములయ్యారు. ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం చర్చోపర్చలు జరిగాయి. ఆ నాటి నిజాం నవాబు కాలంలో హైదరాబాద్ సంస్థాన ప్రముఖులు, ప్రజలు సమావేశాలు ఏర్పాటు చేసుకొన్నారు. ఆరో నిజాం కాలంనాటి అధికారిక భవన నిర్మాణ నిపుణుల ప్రత్యేక్ష పరవేక్షణలో రూపుదిద్దుకుంది. కుతుబ్, ఆసిఫ్ జాహీల కాలంలో కట్టించిన అనేక చారిత్రక భవనాల కంటే కూడా అత్యాధునిక నిర్మాణ శైలిని సంతరించుకొన్న టౌన్‌హాల్æ ఇరానీ, మొగల్, రాజస్థానీ వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించారు. రాజస్థాన్ లోని మఖరానా నుంచి రాళ్లను తెప్పించారు. (తాజ్æమహల్æకు సైతం ఇక్కడి రాళ్లనే వినియోగించారు) రెండంతుస్తుల్లో నిర్మింన భవనంలో ఒక సువిశాలమైన హాల్æ, దాని చుట్టూ సుమారు 20 గదులు ఉంటాయి,. గోపురాలకు డంగు సున్నం, బంకమట్టిని వినియోగించారు. గోపురాలు, కమాన్లు మొగలాయి వాస్తు శైలిలోను, గోడలపై కళాత్మక దృశ్యాలు, లతలు ఇరాన్, రాజస్థానీ శైలితో తీర్చిదిద్దారు. అన్ని రకాల వాతావరణæ పరిస్థితులకు తట్టుకొనే విధంగా కట్టించారు. చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండడం ఈ భవనం ప్రత్యేకత. అసెంబ్లీ భవనంతో పోస్టల్ స్టాంప్ భవన నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చాక.. నిజాం సంస్థాన ప్రజలందరికీ దాని ప్రత్యేకతను తెలియజేయడానికి ఏదన్నా చేయాలనుకున్నారు. అలా 1940లో భవనం ఫొటోతో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. దీని విలువ ఒక అణా. -
మార్గదర్శి.. మహాత్మా పూలే: జోగు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావుపూలే దేశానికి మార్గదర్శనం చేసిన మహనీయుడని బీసీ సంక్షేమ మంత్రి జోగు రామన్న అన్నారు. పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గడ్డం సాయికిరణ్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ రవీంద్రభారతిలో పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జోగు రామన్న మాట్లాడుతూ సమాజంలో విలువలతో బతకాలన్నా, సంస్కారంతో ఉండాలన్నా విద్యతోనే సాధ్యపడుతుందన్నారు. అణగారిన వర్గాల ఉన్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ మరొక పూలే అని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.33 వేల కోట్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ నిర్ణయం మేరకు వచ్చే జయంతికల్లా పూలే విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై నెలకొల్పుతామని హామీనిచ్చారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ మైనార్టీలకు ఎక్కువ సంఖ్యలో రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కేసీఆర్ అండగా ఉంటూ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. పశు సంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ పూలే బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన యోధుడని, అందరికీ సమానహక్కులు ఉండాలని ఆకాంక్షించిన మహనీయుడని అన్నారు. ఒకప్పుడు దొరలకు, భూస్వాములకు మాత్రమే భూములెక్కువగా ఉండేవని, ప్రస్తుతం గ్రామాల్లోని రికార్డుల ప్రకారం అధికశాతం భూములు బీసీలకే ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల పక్షపాతి అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశ పెడితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీలకు చట్టసభల్లో వాటా తెచ్చే విధంగా పోరాడితేనే పూలేకు ఘనమైన నివాళి అని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్ ముదిరాజ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీసీ సంక్షేమశాఖ కమిషనర్ అనితారాజేంద్ర, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
క్రీస్తు ప్రేమను పంచాలి
క్లాక్‌టవర్(మహబూబ్‌నగర్): రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. బుధవారం రాత్రి జిల్లాకేంద్రంలోని ఎంబీసీ చర్చి ఆవరణలో రెవ.వరప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఆయన కేక్‌కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. క్రైస్తవుల సమస్యలు ఏమిటో తమకు తెలుసునన్నారు. క్రైస్తవులకు క్రీస్తుప్రేమను లోకమంతా పంచాలన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..శాంతి సమాధానాలతో పండుగను జరుపుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. దేవుడి ఆశీర్వాదంతోనే ఈరోజు మీముందు ఉన్నానని అన్నారు. క్రైస్తవుల అభివృద్ధికి మంత్రిగా తనవంతు కృషిచేస్తానని హామీఇచ్చారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్టారావు మాట్లాడుతూ.. క్రీస్తుప్రేమ వర్ణించలేదని, విశ్వాసులంతా క్రీస్తును పోలి నడుచుకోవడం అభినందనీయమన్నారు. లోకమంతా ప్రేమను పంచుతూ రాణించాలన్నారు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ.. ప్రేమతో నడుచుకోవడం క్రైస్తవులకే సాధ్యమన్నారు. క్రైస్తవుల పట్ల తనకు ఎనలేని అభిమానం ఉందన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానన్నారు. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత లోకంలో శాంతి సమాధానాలు కరువడంతో అన్యాయాలు, అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. వాటిని అధిగమించేందుకు ప్రార్థించాలన్నారు. అనంతరం అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా ఈమందిరంలో ప్రార్థనలు చేశా.. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చాడని గుర్తుచేశారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. చిన్నప్పట్నుంచి సండేస్కూల్కి వెళ్లేవాడిని, బైబిల్‌పై తనకు పూర్తిగా విశ్వాసం ఉందన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. క్రైస్తవులు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమను పంచాలన్నారు. జెడ్పీచైర్మన్ బండారి బాస్కర్ మాట్లాడుతూ.. మూటలు మూసే తనను దేవుడు ఈస్థితికి తీసుకొచ్చాడన్నారు. కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ఈ లోకంలో ప్రజలు బాధలు, ఆవేదనలో కూరుకుపోయి ఉన్నారని, వీటి నుంచి విముక్తి కల్పించడం యేసుక్రీస్తు ప్రభువుకే సాధ్యమన్నారు. అనంతరం జేసీ ఎల్.శర్మన్, ఏజేసీ డాక్టర్ రాజారాం తదితరులు మాట్లాడారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంబీసీ వైస్ చైర్మన్ బీఏ పురుషోత్తం, కార్యదర్శి జోసెఫ్, కౌన్సిల్ నేతలు, అధికసంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.