బిగ్‌బాస్ నాల్గో సీజన్ గ్రాండ్ ఫినాలే నేడు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా ఇప్పటికే రిలీజ్ చేసింది. హీరోయిన్లు ప్రణీత, మెహరీన్ డ్యాన్సులు, అనిల్ రావిపూడి పంచ్ పటాకాలతో షో డబుల్ జోష్‌తో ముందుకు సాగనున‌్నట్లు తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరూ ఒకే చోట చేరి డ్యాన్సు చేయడం చూడముచ్చటగా ఉంది. కానీ ఆ గుంపులో దేవి నాగవల్లి మాత్రం కనిపించలేదు. ఇప్పటికే రీయూనియన్‌లో మోనాల్, లాస్య, సుజాత, గంగవ్వ, నోయల్, కుమార్ సాయి, అవినాష్, దివి, మెహబూబ్, కల్యాణి హౌస్‌లోకి వె‌్లి వచ్చారు. కానీ సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్, దేవి నాగవల్లి మాత్రం వెళ్లలేదు. తాజా ప్రోమోలో దేవి నాగవల్లి తప్ప మిగతా ఇద్దరు కూడా స్టేజీపై కనిపించారు. దీంతో ఆమె ఎందుకు గ్రాండ్ ఫినాలేకు వెళ్లలేదన్న చర్చ నడుస్తోంది. అయితే ఆమె తన ఎలిమినేషన్‌పై అసంతృప్తితో ఉండటం వల్లే ఫినాలేకు హాజరు కాలేదని తెలుస్తోంది.
కాగా లేడీ బిగ్‌బాస్ అవుతానంటూ షోలో ఎంట్రీ ఇచ్చిన దేవి నాగవల్లి మూడో వారంలోనే ఎలిమినేట్ అయింది. అప్పటివరకు ఆమెతో పెద్దగా కలిసినట్లు కనిపించని ఇంటిసభ్యులు దేవి వెళ్లిపోతుంటే మాత్రం కంటతడి పెట్టుకున్నారు. బిగ్‌బాస్ హౌస్ ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కోల్పోయిందని ఎంతోమంది ఫీలయ్యారు. అయితే ఉన్నన్ని రోజులు దేవి బిగ్‌బాస్ నిబంధనలను తు.చ తప్పకుండా పాటించేది. చాలామంది మొదట్లో రూల్స్ బ్రేక్ చేసి బిగ్‌బాస్ చేత అక్షింతలు వేయించుకునేవారు. ఓసారైతే ఇంటి సభ్యుల నిర్లక్ష్యానికి చిర్రెత్తిన బిగ్‌బాస్ అందరికీ చీవాట్లు పెట్టాడు. ఈ క్రమంలో క్షమించమంటూ కంటెస్టెంట్లు నిల్చుని రెండు చేతులు జోడిస్తూ వేడుకున్నారు. కానీ దేవి నాగవల్లి మాత్రం తను ఏ తప్పూ చేయలేదని దర్జాగా కూర్చుండిపోయి అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇలా ఏ విషయంలోనైనా తనకంటూ ఓ క్లారిటీ ఉంటుంది. అలాగే సింగర్, డ్యాన్సర్‌గా తనలోని కొత్త కోణాలను సైతం అభిమానులకు పరిచయం చేసింది. (నోయల్ రాకతో అభిజిత్ ఎమోషనల్)
కానీ మరీ తొందరగా మూడో వారంలోనే ఎలిమినేట్ కావడం ఆమె ఊహించలేకపోయింది. బయటకు వచ్చాక కూడా ఇదే అసంతృప్తిని వెల్లగక్కింది. 'బిగ్‌బాస్‌ను నమ్మి వెళ్లాను. నాకు ఓట్లు తక్కువ వచ్చాయి, కాబట్టి ఎలిమినేట్ అయ్యానన్నారు. కానీ బయట మాత్రం నాకు ఓట్లు ఎక్కువ వచ్చాయని చాలామంది అంటున్నారు. అంటే నాకంటే వెనక ఉన్నవాళ్లను వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్‌గా ఉంది. నా వల్ల స్క్రిప్ట్ మారిపోతుందని నన్ను పంపించేసి ఉండొచ్చు' అని బాధపడింది. బిగ్‌బాస్ షో తనకు ద్రోహం చేసిందన్న భావనతోనే ఆమె ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకు వెళ్లడానికి నిరాకరించిందేమోనని నెటిజన్లు చర్చిస్తున్నారు. (బిగ్‌బాస్: చతికిలపడ్డ కంటెస్టెంట్లు వీళ్లే)
Comments
Please login to add a commentAdd a comment