బిగ్‌బాస్ షో ప్రారంభంలో దేవి నాగవల్లి పేరు వింటేనే ఓ రకమైన వ్యతిరేకత కనిపించేది. కానీ మూడోవారంలో ఆమె ఎలిమినేట్ అయిన మరుక్షణం ఈక్వేషన్స్ మారిపోయాయి. దేవిని తన శత్రువుగా ప్రకటించిన అమ్మ రాజశేఖర్ ఆమె హౌస్‌లో ఉండదని తెలిసి బోరున ఏడ్చేశాడు. ఏనాడూ ఆమెతో కలిసిమెలిసి ఉన్నట్లుగా కనిపించని హౌస్‌మేట్స్ చిన్నపిల్లల్లా విలపించారు. ప్రేక్షకులు సైతం ఆమె ఎలిమినేషన్‌తో షాక్‌లో ఉన్నారు. బిగ్‌బాస్ స్క్రిప్టుకు అడ్డొస్తుందని దేవిని కావాలనే పంపించేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు దేవి బయటకు వచ్చేయడానికి కారణం కరాటే కల్యాణి అని మరికొందరు ఆగ్రహిస్తున్నారు. ఆమెను నేరుగా నామినేట్ చేస్తూ బిగ్‌బాంబ్ వేయడమే దీనికంతటికీ కారణమని నిందిస్తున్నారు. అయితే దేవి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని, ఆమె వెళ్లిపోతుందని ఊహించలేదని కల్యాణి బాధపడ్డారు. (చదవండి: దేవి నాగవల్లికి దాసరి ఏమవుతారో తెలుసా?)
నేను ఇప్పటికీ షాక్‌లో ఉన్నాను
ఈ క్రమంలో హౌస్‌లో ఉండేందుకు దేవి అన్ని విధాలా అర్హురాలు అంటూ ఆమె మళ్లీ బిగ్‌బాస్‌కు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై దేవి నాగవల్లి స్పందించింది. అలాగే తన ఎలిమినేషన్‌పైనా అనుమానం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "బిగ్‌బాస్ షోను నమ్మి వెళ్లాను. నాకు ఓట్లు తక్కువ వచ్చాయి, అందుకే ఎలిమినేట్ అయ్యారని నాకు చెప్పారు. నేనూ అదే నమ్మాను. కానీ బయటకు వచ్చాక నాకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చాలామంది అంటున్నారు. నాకంటే వెనక ఉన్నవాళ్లను వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్‌గా ఉంది"
రీ ఎంట్రీ ఉండకపోవచ్చు
"మెహబూబ్‌కు నాకన్నా తక్కువ ఓట్లు వచ్చాయని విన్నాను. అలాంటప్పుడు నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారనేది నాకర్థం కావడం లేదు. నా వల్ల స్క్రిప్ట్ మారిపోతుంది కాబట్టి.. వాళ్లు అనుకున్న గేమ్ ప్లాన్ రావడం లేదు కాబట్టి.. ఇలా జరిగి ఉండవచ్చు. ఎలిమినేషన్ తరువాత చాలా షాక్‌లో ఉండిపోయా, బయటకు రాలేకపోతున్నా. నాకు రీ ఎంట్రీ అవకాశం వస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే కరోనా వల్ల 14 రోజుల క్వారంటైన్ అని పెద్ద పని ఉంటుంది. ఒకవేళ రీఎంట్రీ ఛాన్స్ ఇస్తే వెళ్తాను. కానీ ఈ సీజన్‌లో అది దాదాపు ఉండకపోవచ్చు. నా ఎలిమినేషన్ నచ్చలేదని బిగ్‌బాస్ గత సీజన్ కంటెస్టెంట్లు అలీ రెజా, శ్యామల, గీతా మాధురి వంటి సెలబ్రిటీలు బాధపడటం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది" అని చెప్పుకొచ్చింది. (చదవండి: నా మీద నాకే డౌటేసింది: వితికా)
Comments
Please login to add a commentAdd a comment