రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. ఎప్పుడు ఏ అంశంపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తాడో ఆయనకే తెలియదు. ఊహకు అందని పనులు చేయడం, తన మాటలతో అవతలి వాళ్లను వెర్రోళ్లను చేయడంలో ఆయనకు ఆయనే దిట్ట. ఇక ఆయన సినిమాలు కూడా అంతే. తనకు మనసులో ఒక ఐడియా వచ్చిందంటే చాటు దానిని బిగ్ స్ర్కీన్‌పై పెట్టేస్తాడు. అంత విచిత్రమైన మనిషి బిగ్ బాస్ లోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.. అబ్బా అదిరిపోతుంది కదా. తన ప్రశ్నలతో.. చేష్ఠలతో కనిపించని బిగ్ బాస్‌కు కూడా తలనొప్పులు తెప్పిస్తాడు. బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా అంతటి సాహసం చేయకపోవచ్చులే.
(చదవండి : బిగ్‌బాస్: అవినాష్‌కు నాగ్ ఊహించని గిఫ్ట్)
కాగా, వర్మ కూడా తనకు బిగ్‌బాస్ షో అంటేనే తెలియదని చెప్పాడు. అందులో 16 మంది కంటెస్టెంట్స్ ఉంటారంటే.. ఏం చేస్తారు అని అడిగాడు. అలాంటి వ్యక్తి యూటర్న్ తీసుకొని ఉన్నఫలంగా తాను బిగ్‌బాస్‌లోకి వెళ్తా అంటున్నాడు. వర్మ నేతృత్వంలో వచ్చిన కరోనా వైరస్ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగానే ఎలక్ట్రానిక్, యూ ట్యూబ్ ఛానెల్స్ అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చాడు వర్మ. ఇలా ఓ ఇంటర్వ్యూలలో బిగ్ బాస్ గురించి చెప్పాడు వర్మ. తాను బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నానంటూనే, కొన్ని కండీషన్స్ పెట్టాడు.తను ఒక్కడినే మగాన్ని పంపించి.. మిగిలిన 15 మందిని అమ్మాయిలను పంపిస్తే 100 కాదు ఎన్ని రోజులైనా బిగ్ బాస్ హౌజ్‌లో ఉండటానికి తనకేం అభ్యంతరం లేదంటూ తనదైన శైలీలో సమాధానం చెప్పి మరోసారి అందరిని వెర్రొళ్లను చేశాడు వర్మ.
Comments
Please login to add a commentAdd a comment