అరియానాతో సినిమా తీస్తా: రామ్ గోపాల్ వ‌ర్మ‌ | Bigg Boss 4 Telugu: Ram Gopal Varma Comments On Ariyana Glory | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్‌

Dec 6 2020 8:42 PM | Updated on Dec 7 2020 3:26 AM

Bigg Boss 4 Telugu: Ram Gopal Varma Comments On Ariyana Glory - Sakshi

టాలీవుడ్ సంచ‌ల‌నం రామ్‌గోపాల్ వ‌ర్మ‌. 'శివ' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు తీసిన ఆయ‌న ఇప్పుడు మాత్రం ఏ అంశం దొరికినా దానిపై సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. ఎవ‌రిని ఫాలో అవ‌డం న‌చ్చ‌ని ఈ ద‌ర్శ‌కుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక రూటు క్రియేట్ చేసుకుంటారు. త‌న మాట‌, సినిమాలు, చేత‌లు అన్నీ ప్ర‌త్యేకంగా, చిత్ర‌విచిత్రంగా ఉంటాయి. ఇంత ప్ర‌త్యేకత ఉన్న ఆయ‌న త‌న సినిమాల ద్వారా, ఇంట‌ర్వ్యూల ద్వారా ఎంద‌రినో ఫేమ‌స్ చేస్తున్నారు. అందులో బిగ్‌బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఒక‌రు. ఆమె వ‌ర్మ‌ను ఇంట‌ర్వ్యూ చేస్తున్న వీడియో అప్ప‌ట్లో నెట్టింట తెగ వైర‌ల్ అయింది. అందులో అరియానా.. ఈ మ‌ధ్య మీకు ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించింది అని అడగ్గా నువ్వే అని వ‌ర్మ సూటిగా స‌మాధాన‌మిచ్చారు. త‌ర్వాత అరియానా పేరు మార్మోగిపోయింది. అలా ఆమెను బిగ్‌బాస్ ఆఫ‌ర్ కూడా వరించింది. ప్ర‌స్తుతం ఆమె షోలో టాప్ 5లో స్థానం ద‌క్కించుకునేందుకు పోరాడుతోంది. (చ‌ద‌వండి: మళ్లీ తెరపైకి దిశ ఎన్‌కౌంటర్‌ చిత్రం)

తాజాగా ఓ యాంక‌ర్ అరియానా బిగ్‌బాస్ హౌస్‌లో ఉంద‌ని రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించ‌గా తాను బిగ్‌బాస్ చూడ‌న‌ను అని తేల్చి చెప్పారు. అస‌లు హౌస్‌లో ఎంత మంది ఉంటారు? అని యాంక‌ర్‌నే తిరిగి ప్ర‌శ్నించారు. దీంతో ఆమె 16 మంది అని స‌మాధాన‌మిచ్చింది. అరియానా టాప్ 5లోకి కూడా వెళ్తుందంటున్నారు అని యాంక‌ర్‌ చెప్పుకురాగా.. అంటే, ఐదుగురు విన్న‌ర్ అవుతారా? అని వ‌ర్మ వింత సందేహాన్ని వెలిబుచ్చ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇక‌ అరియానాతో సినిమా తీయాల‌నుంద‌ని వ‌ర్మ మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టారు. మ‌రి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆ బోల్డ్ బ్యూటీ ఈ ఆఫ‌ర్‌పై ఏమ‌ని స్పందిస్తుందో చూడాలి! (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్ ఎలిమినేట్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement