
దాదాపు 15 వారాల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన బుల్లితెర బిగ్ రియాల్టీషో బిగ్‌బాస్ నాల్గో సీజన్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతను ప్రకటించనున్నారు. దీంతో ఈ సారి ఎవరు గెలవబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. మరో వైపు గ్రాండ్ ఫినాలేకు ఎవరు ముఖ్య అతిథిగా వస్తారు? ఎంత మంది హీరోయిన్లు తమ డాన్స్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొడతారు? అసలు ఫినాలేలో ఎలాంటి సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఉంటాయో చూసేందుకు బుల్లితెర ప్రేక్షకులు ఆతృతగాగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షుల ఆసక్తిని మరింత పెంచేందుకు ఖతర్నాక్ ప్రోమోను వదిలారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.తాజాగా ప్రోమోలో హోస్ట్ నాగార్జున స్పెషల్ ఎంట్రీ ఇవ్వగా.. ఎలిమినేట్ కంటెస్టెంట్స్ అందరూ సందడి చేస్తున్నారు. గంగవ్వ దివి, మోనాల్, మెహబూబ్, కుమార్ సాయి,అవినాష్, అమ్మ రాజశేఖర్ ఇతర కంటెస్టెంట్స్ స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తున్నారు.
గంగవ్వను అయితే ప్రత్యేకంగా కొంతమంది ఎత్తుకొని మరి స్టేజ్ మీదకు తీసుకువచ్చారు. ఇక హీరోయిన్ ప్రణీత, మెహరీన్ స్పెషల్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి పంచ్ వేసి అలరిస్తున్నారు. హౌస్‌మేట్స్‌ని ఇమిటేట్ చేసి నవ్వించాడు. ఇక గంగవవ్వ అయితే తన ఇంటికి ఒక్కొక్క రోజు ఐదు నూర్ల మంది వస్తున్నారని, నాకు రామ రామ గోస అయితుందంటూ..హోస్ట్ నాగ్‌కు తన అభిమాన బాధను పంచుకుంది. లాస్య ఏమో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చక ఇంత వరకు పప్పే తినలేదని చెబుతోంది. మరో వైపు తమన్ లైవ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. టాప్ 5 కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు షోకి వచ్చినట్లు ప్రోమోలో చూపించారు. ఇక ఈ సీజన్‌కి గెస్ట్ ఎవరు అనేది మాత్రం రివీల్ చేయలేదు.