Divi Vadthya: టాప్‌ యాంకర్లను వెనక్కు నెట్టిన దివి! | Hyderabad Times Declares BB4 Fame Divi Vadthya Most Desirable Woman On TV 2020 | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ బ్యూటీ దివికి అరుదైన గౌరవం

Published Mon, May 31 2021 4:34 PM | Last Updated on Mon, May 31 2021 5:31 PM

Hyderabad Times Declares BB4 Fame Divi Vadthya Most Desirable Woman On TV 2020 - Sakshi

'దివి నుంచి దిగివచ్చావా ఆపిల్‌ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్‌ గ్రావిటీ...'  ఈ పాట వినగానే బుల్లితెర అభిమానులకు, అందులోనూ బిగ్‌బాస్‌ ప్రేమికులకు టపీమని గుర్తొచ్చే పేరు దివి వైద్య. అందచందాలతోనే కాదు, సూటిగా సుత్తి లేకుండా ఏదైనా ముఖం మీదే మాట్లాడే దివి తన యాటిట్యూడ్‌తో ఎంతోమందిని బుట్టలో వేసుకుంది. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న ఆమె హౌస్‌లో తన ప్రయాణం ఎక్కువ రోజులు సాగకపోయినప్పటికీ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. అలా ఏకంగా మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పట్టేసింది.

తాజాగా దివి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్‌ డిజైరబుల్‌ వుమెన్‌గా దివి నిలిచింది. హైదరాబాద్‌ టైమ్స్‌ దివిని బుల్లితెర మోస్ట్‌ డిజైరబుల్‌ వుమెన్‌గా ప్రకటించింది. శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ వంటి టాప్‌ యాంకర్లను సైతం వెనక్కు నెట్టి మరీ దివి ఫస్ట్‌ ప్లేస్‌లో నిలవడమంటే మామూలు విషయం కాదు.

దీని గురించి దివి మాట్లాడుతూ.. "ఇది కలా? నిజమా? ఇప్పటికీ అస్సలు నమ్మశక్యంగా లేదు. జనాలు నా అందం కన్నా నా గుణాన్ని ప్రేమించారు. అందరూ నన్ను బ్యూటీ విత్‌ బ్రెయిన్‌ అంటుంటే సంతోషంగా ఉంటుంది. అయినా కాలంతో పాటు అందం మారిపోతుందేమో కానీ తెలివితేటలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దివి పాప ఇలాంటి రికార్డును సాధించడంతో అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు.

హైదరాబాద్‌ టైమ్స్‌.. మోస్ట్‌ డిజైరబుల్‌ వుమెన్‌ ఆన్‌ టీవీ-2020 జాబితా ఇదే..

1. దివి వైద్య
2. విష్ణుప్రియ
3. శ్రీముఖి
4. రష్మీ గౌతమ్‌
5. వర్షిణి సౌందరరాజన్‌
6.వర్ష
7.వింధ్యా విశాఖ
8. అశ్విని
9. దీప్తి
10. సమీరా షెరీఫ్‌
11. అషూ రెడ్డి
12. లహరి శరి
13.అనసూయ భరద్వాజ్‌
14. అలేఖ్య హారిక
15. నవ్య స్వామి

చదవండి: ‘బిగ్‌బాస్‌–4’ ఫేమ్‌ దివీ విద్య లీడ్‌ రోల్‌లో ‘క్యాబ్‌ స్టోరీస్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement