Most Desirable Woman
-
మరోసారి సౌత్ మోస్ట్ డిసైరబుల్ ఉమెన్‌గా రష్మిక
రష్మిక మందన్నా మరోసారి మోస్ట్ డిసైరబుల్ ఉమెన్‌గా నిలిచింది. 2014లో టైమ్స్ ఫ్రెష్ ఫేస్ నేషనల్ విన్నర్‌గా నిలిచిన రష్మిక తాజాగా బెంగళూరు టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ ఉమెన్ 2020గా పేరు తెచ్చుకుంది. బెంగళూరు టైమ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో రష్మిక మొదటి స్థానంలో నిలిచినట్లు ఆ సంస్థ తన ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఆమె రెండుసార్లు మోస్ట్ డిసైరబుల్ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్నట్లు బెంగళూరు టైమ్స్ బుధవారం ప్రకటించింది. కాగా తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో గుగూల్ నేషనల్ క్రష్‌గా మారిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో నటించిన ఆమె చిత్రాలు ఛలో, గీతా గోవిందం, భీష్మ, సరిలేరు నీకేవ్వరు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఆమె బాలీవుడ్లో కూడా రెండు సినిమాలకు సంతకం చేసింది. బిగ్‌బీ అమితాబచ్చన్‌తో ఆమె నటిస్తున్న గుడ్‌బై చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. దీనితో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్ర పుష్పలో హీరోయిన్గా నటిస్తోంది. -
Divi Vadthya: టాప్ యాంకర్లను వెనక్కు నెట్టిన దివి!
'దివి నుంచి దిగివచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ...' ఈ పాట వినగానే బుల్లితెర అభిమానులకు, అందులోనూ బిగ్‌బాస్ ప్రేమికులకు టపీమని గుర్తొచ్చే పేరు దివి వైద్య. అందచందాలతోనే కాదు, సూటిగా సుత్తి లేకుండా ఏదైనా ముఖం మీదే మాట్లాడే దివి తన యాటిట్యూడ్‌తో ఎంతోమందిని బుట్టలో వేసుకుంది. బిగ్‌బాస్ నాల్గో సీజన్లో పాల్గొన్న ఆమె హౌస్‌లో తన ప్రయాణం ఎక్కువ రోజులు సాగకపోయినప్పటికీ తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. అలా ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని పట్టేసింది. తాజాగా దివి ఓ అరుదైన ఘనత సొంతం చేసుకుంది. 2020లో టీవీ పరిశ్రమకు చెందిన మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా దివి నిలిచింది. హైదరాబాద్ టైమ్స్ దివిని బుల్లితెర మోస్ట్ డిజైరబుల్ వుమెన్‌గా ప్రకటించింది. శ్రీముఖి, విష్ణుప్రియ, అనసూయ వంటి టాప్ యాంకర్లను సైతం వెనక్కు నెట్టి మరీ దివి ఫస్ట్ ప్లేస్‌లో నిలవడమంటే మామూలు విషయం కాదు. దీని గురించి దివి మాట్లాడుతూ.. "ఇది కలా? నిజమా? ఇప్పటికీ అస్సలు నమ్మశక్యంగా లేదు. జనాలు నా అందం కన్నా నా గుణాన్ని ప్రేమించారు. అందరూ నన్ను బ్యూటీ విత్ బ్రెయిన్ అంటుంటే సంతోషంగా ఉంటుంది. అయినా కాలంతో పాటు అందం మారిపోతుందేమో కానీ తెలివితేటలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా దివి పాప ఇలాంటి రికార్డును సాధించడంతో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. హైదరాబాద్ టైమ్స్.. మోస్ట్ డిజైరబుల్ వుమెన్ ఆన్ టీవీ-2020 జాబితా ఇదే.. 1. దివి వైద్య 2. విష్ణుప్రియ 3. శ్రీముఖి 4. రష్మీ గౌతమ్ 5. వర్షిణి సౌందరరాజన్ 6.వర్ష 7.వింధ్యా విశాఖ 8. అశ్విని 9. దీప్తి 10. సమీరా షెరీఫ్ 11. అషూ రెడ్డి 12. లహరి శరి 13.అనసూయ భరద్వాజ్ 14. అలేఖ్య హారిక 15. నవ్య స్వామి చదవండి: ‘బిగ్‌బాస్–4’ ఫేమ్ దివీ విద్య లీడ్ రోల్లో ‘క్యాబ్ స్టోరీస్’ -
మెరుపు చూపిస్తున్న ‘జిగేల్ రాణి’
ముకుంద సినిమాతో తెలుగు తెరపై మెరిసిన పూజ హెగ్డే అందంతోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంది. తరువాత బాలీవుడ్‌పై కన్నేసింది ఈ సుందరి. హృతిక్‌రోషన్ సినిమా మొహంజదారో సినిమాలో నటించింది. కానీ అది బెడిసికొట్టింది. సినిమా ఆడకపోవడంతో నిరాశ పడినా...తెలుగులో అల్లుఅర్జున్ సరసన డీజే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో అమ్మడు అందాలకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు వరుస కట్టి తెలుగులో సినిమాలు చేస్తోంది. రాంచరణ్ రంగస్థలం సినిమాలో చేస్తున్న జిగేల్ రాణి అంటూ సాగే ప్రత్యేకగీతం మాత్రం తనకు ప్రత్యేకమే అంటోంది ఈ చిన్నది. ఆ సాంగ్‌ను తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ తనకు ఎగిరి గంతులేయానిపిస్తుందటా. అంతలా ఆ సాంగ్ ఆడియో, విజువలైజేషన్ తనను ఆకట్టుకున్నాయని చెపుతోంది. ప్రస్తుతం పూజ ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబుల సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు హైదరాబాద్ మోస్ట్ డిజరైబుల్ ఉమెన్ లిస్ట్‌లో కాజల్, తమన్నా, శృతిహాసన్ లాంటి సీనియర్లను వెనక్కినెట్టి పూజ అగ్రస్థానంలో నిలబడింది. -
ఆయన అండ ఉంటే చాలు!
సెక్సీ స్టార్ సన్నీ లియోన్ మోస్ట్ డిజైరబుల్ ఉమన్‌గా ఎంపికయ్యారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే లాంటి టాప్ హీరోయిన్స్‌ని పక్కనబెట్టి ఆమె నం.1గా నిలిచారు. ఆంగ్ల దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్లైన్లో జరిపిన ఈ సర్వేపై సన్నీ స్పందిస్తూ -‘‘నాకు నచ్చిన విధంగా జీవితాన్ని గడుపుతున్నాను. మిగిలిన వాళ్లకెలా ఉన్నా... ఎంత వయసొచ్చినా నా భర్త డేనియల్‌కు మాత్రం ఎప్పటికీ మోస్ట్ డిజైరబుల్గా మిగిలిపోవాలని ఆశ. నేను ఇప్పుడిప్పుడే బాలీవుడ్లో స్థిరపడుతున్నా. నా భర్త ప్రోత్సాహంతోనే ఇంతవరకూ రాగలిగాను. ఆయన అండ ఉంటే చాలు’’ అని చెప్పారు. ‘‘నిర్మాత ఏక్తా కపూర్‌తో మీకు గొడవ జరిగిందటగా?’’ అనడిగితే ‘‘అలాంటిదేం లేదు. నాకు ఆమె అంటే చాలా గౌరవం. ‘ఎక్స్ఎక్స్ఎక్స్’ చిత్రం గురించి ఆమె నన్ను సంప్రతించారు. కానీ అందులో హద్దుమీరే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇది వరకే నేను అలాంటి చిత్రాలు చాలా చేశాను. మళ్లీ ఆ దారిలో వెళ్లకూడదని నిర్ణయించుకుని ఆ చిత్రానికి నో చెప్పాను. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలూ లేవు ’’ అని చెప్పారు. -
మోస్ట్ డిజైర్బుల్ ఉమెన్‌గా శృతి