
బిగ్‌బాస్ షో ముగిసి చాలా రోజులైనా ఆ షోలో పాల్గొన్న వారంతా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘కథ వేరుంటది’ అని బిగ్‌బాస్ షో-4లో హల్‌చల్ చేసిన సోహేల్ అక్కినేని నాగార్జునను, చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. తాజాగా ఆ షో రన్నరప్‌గా నిలిచిన అఖిల్ సార్ధక్ కింగ్ నాగార్జునను కలిశాడు. తన తల్లితో కలిసి నాగ్ నివాసానికి అఖిల్ చేరుకున్నాడు.
తన తల్లితో కలిసి నాగార్జునతో దిగిన ఫొటోలను అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘నాగార్జునను మరోసారి కలవడం చాలా ఆనందంగా ఉంది.. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.. బిగ్‌బాస్ రోజుల్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా.. లవ్ యూ సర్ మీ టైమ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్’ అంటూ పోస్ట్ చేశాడు. నాగ్, అఖిల్ గట్టిగా నవ్వుతూ కనిపించారు. హోస్ట్‌గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున షోలో అఖిల్ సార్థక్‌తో కొంత చనువుగా ఉన్నారు. అఖిల్‌పై జోక్స్ వేస్తూ.. అతడి వస్త్రధారణను మెచ్చుకుంటూ ఉన్నారు.
‘బిగ్‌బాస్’లోకి టిక్‌టాక్ స్టార్ దుర్గారావు!
బిగ్‌బాస్ 5 : మొదటి కంటెస్టెంట్ పేరు ఖరారు!
Comments
Please login to add a commentAdd a comment