ఫినాలే వరకు సాగే మీ ప్రయాణంలో ఎవరు మీకు అడ్డుపడతారని భావిస్తారో, ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్ పేరు చెప్పమని బిగ్‌బాస్ ఆదేశించగానే మెజారిటీ ఇంటిసభ్యులు అఖిల్ పేరు చెప్పారు. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యాడని బిగ్‌బాస్ వెల్లడించాడు. కానీ ఇంటిసభ్యుల ముఖాలు చూస్తే ఎవరూ దీన్ని అంతగా నమ్మినట్లు కనిపించలేదు. దీని వెనక ఏదో కుట్ర ఉందని అనుమానపడ్డారు. ముఖ్యంగా అభిజిత్ అస్సలు అంగీకరించలేకపోయాడు. కెప్టెన్సీ కోసమే అంతలా కొట్లాడిన వ్యక్తి వెళ్లిపోమనగానే మారు మాట్లాడకుండా ఎలా వెళ్తాడని వాదించాడు. ఇదంతా స్క్రిప్టెడ్ అని పసిగట్టాడు. హిందీ సీజన్ చూసిన అఖిల్‌కు కూడా సీక్రెట్ రూమ్ ఉంటుందన్న విషయం ముందే తెలిసినట్లుంది. అందుకే తనను పంపించేస్తున్నారనగానే ఏమీ వాదించకుండా బ్యాగు పట్టుకుని వెళ్లిపోయాడు. (అఖిల్ ఎలిమినేట్; వెక్కివెక్కి ఏడ్చిన సోహైల్, మోనాల్)
ఇది బిగ్‌బాస్ టీమ్‌కు నచ్చనట్లుంది. పెద్దగా డ్రామా పండలేదని నిరుత్సాహపడినట్లు తెలుస్తోంది. దీంతో నేడు నాగార్జున అఖిల్‌కు క్లాస్ పీకుతున్నారు. నీకు విన్నర్ అవడం ఎంత అవసరమో నాకు తెలుసు, అలాంటిది వెళ్లిపోమనగానే ఎలా ఒప్పుకున్నావు అని ప్రశ్నించాడు. దీంతో అఖిల్ తనది ఫేక్ ఎలిమినేషన్ అన్న విషయం ముందే పసిగట్టినట్లు ఒప్పుకుంటూ స్ట్రాంగ్ కంటెస్టెంటును బయటకు పంపిస్తే వీక్ కంటెస్టెంట్లతో గేమ్ ఆడుతారా? అని ఎదురు ప్రశ్నించాడు. దీంతో అఖిల్ ఓవర్ కాన్ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టేందుకు సిద్ధమైన నాగ్ నీ అంచనా తప్పు.. బ్యాగు సర్దుకుని బయటకు వచ్చేయ్ అని సీరియస్ అయ్యారు. ఊహించని షాక్‌తో విస్తుపోయిన అఖిల్ ప్లీజ్ సార్, మిమ్మల్ని అర్థిస్తున్నా.. ఎలిమినేట్ చేయకండి అంటూ చేతులెత్తి వేడుకుంటున్నాడు. అయినా సరే లెక్క చేయని నాగ్.. ముందు బ్యాగు సర్దుకుని వచ్చేయ్ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో అఖిల్ మమ్మీ అంటూ చంటిపిల్లాడిలా ఏడుపు లంకించుకున్నాడు. ఏం చేసినా అఖిల్ మాత్రం ఎలిమినేట్ కాడనే విషయం ప్రేక్షకులకు బాగా తెలుసు. (నాలుగన్నరేళ్లు ఓ అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నాను: దేత్తడి)
Comments
Please login to add a commentAdd a comment