బిగ్‌బాస్ సీజన్ 4.. చూస్తుండగానే నెల గడిచిపోయింది. గత నాలుగు వారాలుగా చిన్న చిన్న గొడవలు, బిగ్‌బాస్ ఇచ్చిన ఫన్నీ టాస్కులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో షో గడిస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అంతా మాస్కులు తీసేసి ఓరినల్ ఆటను ప్రారంభించారు. ఇక శనివారం నాటి ఎలిమినేషన్, ఆదివారం నాటి ఎంటర్టైన్మెంట్‌తో అలా నాల్గో వీకెండ్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఐదో వారంలో ఇలా అడుగుపెట్టింది. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నామినేషన్ ప్రక్రియ మొదలైందంటే.. హౌస్‌లో గొడవలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఐదో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మాత్రం కాస్త రసవత్తంగా సాగనుంది. నామినేషన్ ప్రక్రియలో అభిజిత్, అఖిల్‌కు మాటల యుద్దమే జరిగింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలే దానికి నిదర్శనం.
అందులో అఖిల్‌కి క్రీమ్ పూసిన తరువాత అభి మాట్లాడుతూ.. నువ్వు మామాలుగా కన్ఫ్యూజ్ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు అని గట్టిగా ఇచ్చేశాడు. వెంటనే స్పందించిన అఖిల్..వేలు అలా చూపించి మాట్లాడకు డ్యూడ్ అని సీరియస్ అవ్వగా.. నువ్వు ప్రతిసారి అదే చేస్తున్నావు అంటూ అభిజిత్ అన్నాడు. ఆ రోజు మోనాల్‌ని అలానే వేలు చూపించి మాట్లాడావు అని అభిపై అఖిల్ ఫైర్ అవగా.. ఆమె విషయం నీకెందుకు బ్రదర్ అంటూ అభి కౌంటర్ ఇచ్చాడు. దీంతో అసహనానికి గురైన మోనాల్.. తన గురించి మాట్లాడకండి అంటూ ఏడ్చేసింది. ఆ సమయంలో గంగవ్వ, మోనాల్‌ని ఓదార్చింది. ఇక మరో ప్రోమోలో కూడా కంటెస్టెంట్స్ మధ్య జరిగిన మాటల యుద్దాన్నే చూపించారు. అందులో కూడా అభి, అఖిల్‌ల ఫైటే ఉంది. అంతగానం మాట్లాడేది ఉంటే బయటకెళ్లి మాట్లాడుతో అని అభి సూచించగా.. దమ్ముంటే నన్నుఇక్కడి నుంచి పంపించు బయటకెళ్లి మాట్లాడుకుంటా అంటూ అభి కౌంటర్ ఇచ్చాడు. వేరే వాళ్ల టాపిక్ తీసుకురాకండి.. ఇది జాతీయ చానెల్ అందరూ చూస్తున్నారు అని మోనాల్ మళ్లీ ఏడ్చేసింది.
Argument between #Abijeet & #Akhil in nomination process 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/yg5MG5w8gE
— starmaa (@StarMaa) October 5, 2020
ఇక ఇదంతా చూస్తూ భరించిన సోహైల్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఏదో విషయంలో అభిజిత్ ఫైర్ అయ్యాడు. ఇక లాస్య, దివిల మధ్య మాటల యుద్దం నడిచింది. మొత్తానికి ఈ ప్రోమోలను చూస్తుంటే ఇవాళ హౌజ్‌లో రచ్చ ఎక్కువగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. కాగా ,అభిజిత్ అఖిల్ మోనాల్ ట్రయాంగిల్ కథ అందరికీ తెలిసిందే. మోనాల్ ఆ ఇద్దరితో క్లోజ్‌గానే ఉంటుంది. ఆమె వల్ల అభి, అఖిల్ ఇద్దరు విడిపోయారనేది షో చూస్తున్న వారందరికి అర్థమవుతుంది. మరోవైపు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటూ తన కారెక్టర్‌ని బ్యాడ్ చేస్తున్నారంటూ మోనాల్ ఇప్పటికే భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.
Tonight nominations are going to be on a serious note 🔥 #BiggBossTelugu4 Today at 9:30 PM on @StarMaa pic.twitter.com/rIgnvD0RrT
— starmaa (@StarMaa) October 5, 2020
Comments
Please login to add a commentAdd a comment