తెరపైకి ‘ఒరేయ్‌’ ఇష్యూ.. ఏడ్చిన మోనాల్‌ | Bigg Boss 4 Telugu :Fifth Week Elimination Process Started | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ : తెరపైకి ‘ఒరేయ్‌’ ఇష్యూ.. ఏడ్చిన మోనాల్‌

Published Mon, Oct 5 2020 11:29 PM | Last Updated on Tue, Oct 6 2020 1:53 PM

Bigg Boss 4 Telugu :Fifth Week Elimination Process Started - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌ 4.. చూస్తుండగానే నెల గడిచిపోయింది. గత నాలుగు వారాలుగా చిన్న చిన్న గొడవలు, బిగ్‌బాస్‌ ఇచ్చిన ఫన్నీ టాస్కులు, వైల్డ్‌ కార్డు ఎంట్రీలతో షో గడిస్తూ వచ్చింది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్‌ అంతా మాస్కులు తీసేసి ఓరినల్‌ ఆటను ప్రారంభించారు. ఇక శనివారం నాటి ఎలిమినేషన్, ఆదివారం నాటి ఎంటర్టైన్మెంట్‌తో అలా నాల్గో వీకెండ్‌కు ఎండ్ కార్డ్ పడింది. ఐదో వారంలో ఇలా అడుగుపెట్టింది. సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇక నామినేషన్‌ ప్రక్రియ మొదలైందంటే.. హౌస్‌లో గొడవలు జరగడం సహజం. అయితే ఈ వారం మాత్రం నామినేషన్‌ ప్రక్రియ కాస్త సీరియస్‌గా జరిగింది. అభిజిత్‌, అఖిల్‌ మధ్య మాటల యుద్దం,  మోనాల్‌ భావోద్వేగం, సోహైల్‌ ఫైర్‌ లాంటి వాటితో నేటి ఎపిసోడ్‌ రసవత్తంగా సాగింది. ఇక పూర్తి ఎపిసోడ్‌లోకి వెళితే..

మళ్లీ తెరపైకి ‘ఒరేయ్‌’ ఇష్యూ
నేటి ఎపిసోడ్‌ మొత్తం నామినేషన్‌ ప్రక్రియతోనే కొనసాగింది. అందరిని గార్డెన్‌ ఏరియాలోకి పిలిచిన బిగ్‌బాస్‌.. నామినేషన్స్ ప్రక్రియను షురూ చేశారు. ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై స్నోను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పాలని  ఆదేశించాడు. ఇంటి కెప్టెన్‌ కారణంగా నామినేషన్‌ నుంచి కుమార్‌ సాయికి మినహాయింపు లభించింది. అఖిల్‌లో నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. అతను అభిజిత్‌, అమ్మ రాజశేఖర్‌ ముఖాలకు స్నో పూసి నామినేట్‌ చేశారు. ‘ఒరేయ్‌’అన్న విషయంలో హర్ట్‌ అయ్యానని, నేను పర్మిషన్‌ తీసుకొనే అలా అన్నానని అఖిల్‌ చెప్పుకొచ్చాడు. ఏజ్, ఎడ్యుకేషన్ విషయంలో కూడా క్లారిఫికేషన్ ఇవ్వలేదని వాటివల్ల నేను హర్ట్ అయ్యానని ఇక్కడ క్వాలిఫికేషన్ అవసరం లేదని అఖిల్ అన్నాడు. నువ్వు ఒరేయ్ అనడం నాకు నచ్చలేదు.. క్వాలిఫికేషన్ విషయంలో కూడా నీకు క్లారిటీ లేదంటూ అభి వాదించడంతో ఇద్దర మధ్య చాలాసేపు మాటల యుద్దం నడిచింది. 

ఇక అరియానా వచ్చి అఖిల్‌ ముఖానికి, అమ్మా రాజశేఖర్‌ ముఖానికి స్నో పూసి నామినేట్‌ చేసింది. లగ్జరీ బడ్జెట్‌ విషయంలో అఖిల్‌ చేసిన షాపింగ్‌ తనకు నచ్చలేదని, అతను ఇంట్లో ఉన్న 16 మందికి పుడ్‌ వచ్చేలా చేయకుండా.. కొంతమంది పేర్లు మాత్రమే రాసి మిగిలిన వారికి రాకుండా చేశాడని చెప్పుకొచ్చింది. ఇక అమ్మ రాజశేఖర్‌ గురించి చెబుతూ.. తనను వంట చేయడం లేదని అన్నారని, ఆ మాట కాస్త బాధగా ఉందని చెప్పింది. 

కంటతడి పెట్టిన లాస్య
ఇక లాస్య  దివి, నోయల్‌ను నామినేట్‌ చేసింది. కిచెన్‌‌లో పాత్రలు కడగమంటే దిని నేను ఆ పని చేయనని చెప్పిందని, అలా చెప్పడం నచ్చలేదని చెప్పింది. హైస్‌లో అందరూ అన్ని పనులు చేయాలని చెప్పింది. ఇక నోయల్‌ నామినేట్‌కు రీజన్‌ చెబుతూ.. లాస్య బావోధ్వేగానికి లోనయ్యింది. గత వారం నాగ్‌ సర్‌ లాస్య ఫేక్‌గా ఉంటుందా అని అడిగి నోయల్‌ ఎస్‌ చెప్పాడని, అందరి కంటే నోయల్‌ అలా చెప్పడం బాధగా ఉందని కంటతడి పెట్టింది. నోయల్‌ తనకు ముందు నుంచి తెలుసని, ప్రస్తుతం అతనిలో సరిగా ఉండలేకపోతున్నానని చెప్పింది.


అఖిల్‌పై అవినాష్‌ ఫైర్‌
లగ్జరీ బడ్జెట్‌ విషయంలో అఖిల్‌ కొందరి పేర్లు మాత్రమే ఇచ్చాడని, దానివల్ల కొంతమంది పస్తులు ఉండాల్సి వచ్చిందని చెబుతూ అఖిల్‌ని అవినాష్‌ నామినేట్‌ చేశాడు. అందరి పేర్లు రాస్తే అందరికి పుడ్‌ అందేదని, తనకు క్లోజ్‌గా ఉన్నవారి పేర్లు మాత్రమే రాయడం నచ్చలేదని చెప్పుకొచ్చాడు. మధ్య అఖిల్‌ కలగజేసుకొని నేను కావాలని రాయలేదని, నా వల్ల ఎవరూ పస్తులు లేరని చెప్పాడు. సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావని అనడంతో అవినాష్‌ ఫైర్‌ అయ్యారు. నేను సేఫ్‌ గేమ్‌ ఆడడంలేదని, అలా ఆడితే నన్ను ఎందుకు నామినేట్‌ చేస్తలేరని ప్రశ్నించాడు. హిట్‌ మ్యాన్‌ గేమ్‌లో సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నానని చెప్పినందుకు మోనాల్‌ని నామినేట్‌ చేశాడు.

ఇక సుజాత అఖిల్‌, అరియానాను నామినేట్‌ చేయగా, కుమార్ సాయి.. నోయల్‌ని నామినేట్ చేస్తూ ఫస్ట్ నామినేషన్ అప్పుడు చెప్పిన రీజన్‌నే మళ్లీ మళ్లీ చెప్తున్నారని అందుకే తనకు నచ్చలేదని చెప్పాడు. ఇక రెండో వ్యక్తిగా సుజాతను నామినేట్ చేస్తూ.. ఒకరిపై డిపెండ్ అయ్యి ఆటాడుతుందని.. సొంతంగా ఆట ఆడటం లేదని.. నచ్చిన వాళ్ల విషయంలో సెల్ఫిష్‌గా అనిపిస్తున్నారని చెప్పారు. సొహైల్.. అభిజిత్‌ని నామినేట్ చేస్తూ వాష్ రూం క్లీనింగ్‌ విషయంలో నీ ప్రవర్తన నాకు నచ్చలేదని చెప్పాడు. రెండో వ్యక్తిగా నోయల్‌ని నామినేట్ చేస్తూ కాయిన్ టాస్క్ విషయంలో సపోర్ట్ చేస్తాడని అనుకున్నానని కాని అతనే వివాదానికి కారణం అయ్యాడని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు .గంగవ్వ.. నోయల్‌ని, అభిజిత్‌ని నామినేట్ చేసింది.అభిజిత్‌ ఎవ్వరితోనూ సరిగా మాట్లాడడు అందుకే నామినేట్ చేసినట్టు చెప్పింది. రాజశేఖర్ మాస్టర్.. అఖిల్‌, అరియానాలను నామినేట్ చేశారు. లాస్య కష్టపడినట్టుగా అరియానా కిచెన్‌లో చేయడం లేదని చెప్పారు.

అభిజిత్‌, అఖిల్ మధ్య బిగ్‌ఫైట్‌
నామినేషన్‌ ప్రక్రియ అభి, అఖిల్‌ మధ్య వార్‌కు దారి తీసింది. మొదటి వ్యక్తిగా సోహైల్‌ని నామినేట్‌ చేస్తు కోపం తగ్గించుకోవాలని సూచించాడు. ఇక రెండో వ్యక్తిగా అఖిల్‌ని నామినేట్‌ చేస్తూ గట్టిగా వేసుకున్నాడు. నువ్వు మామాలుగా కన్ఫ్యూజ్‌ అవుతావని నాకు తెలుసు. కానీ నువ్వు పచ్చి అబద్ధం ఆడుతావని ఇప్పుడే తెలుసుకున్నా అని అన్నాడు. కళ్లు ఇలా చేసి, ఇలా చూసి మాట్లాడితే ఎదుటి వాడు భయపడడు అని గట్టిగా ఇచ్చేశాడు. యాటిట్యూడ్‌ కూడా నచ్చలేదు, దేనికైనా లిమిట్స్ ఉంటుంది అంటూ అభి మాట్లాడుతుండగా.. అఖిల్ రెచ్చిపోయాడు. ఒక అమ్మాయి గురించి మాట్లాడుతూ ఆమె ఐ లక్ యూ అంటే అదరికీ చెప్పుకోవడమే కాకుండా,  సుజాత గురించి కూడా బ్యాడ్‌గా మాట్లాడుతున్నావ్.. ఇది నేషనల్ ఛానల్ ఒక అమ్మాయి గురించి ఇలా చెప్తే బయటకు ఎలా వెళ్తుంది అంటూ ఫైర్‌ కాగా, మోనాల్‌, సుజాత గురించి నీకెందుకని, ఏదైనా ఉంటే వాళ్లతో మాట్లాడుకుంటానని అభి కౌంటర్‌ ఇచ్చాడు. 

నా క్యారెక్టర్‌తో ఆటలొద్దు : మోనాల్‌
ఇక అభి, అఖిల్‌ పదే పదే తన పేరు ప్రస్తావించడంతో మోనాల్‌ అసహనానికి గురైంది. దయచేసి నా పేరుని తీయకండి అంటూ దండం పెట్టి బోరు బోరున ఏడ్చింది. ఐ లైక్ యు అన్నానంటే ఇద్దరూ ఇష్టమే అని.. ఎవరైనా ఇష్టమే అని.. మీరు మీరూ చూసుకోవాలని కాని.. నేషనల్ ఛానల్‌లో నా క్యారెక్టర్‌ని బ్యాడ్ చేసి.. జీవితాలతో ఆడుకోకూడదని ప్రతి విషయం టెలికాస్ట్ అవుతుందని.. నా క్యారెక్టర్‌తో ఆటలు ఆడొద్దు.. నా క్యారెక్టర్‌ని జడ్జి చేయడానికి మీరు ఎవరు?? అంటూ గట్టిగా అరుస్తూ బోరున ఏడ్చేసింది. గంగవ్వ వెళ్లి మోనాల్‌ను ఓదార్చింది. 

ఇక నోయల్..  అమ్మ రాజశేఖర్‌, సోహైల్‌ను నామినేట్‌ చేశాడు. నామినేషన్ అంటే పాయింట్ ఉండాలని.. ఇంటి నుంచి వెళిపోవడానికి సరైనా పాయింట్ ఉండాలని చెప్పాడు. స్వాతిని మాస్టర్‌ అకారణంగా నామినేట్‌ చేశాడని,  అతని వల్ల ఒక మొక్క ఎదగ కుండానే వెళ్లిపోయిందని అందుకే ఎలిమినేట్ చేస్తున్నట్టు చెప్పాడు నోయల్. అయితే నువ్ స్వాతి విషయం మాట్లాడితే తప్పని అన్నావు.. మరి నువ్ ఇప్పుడు స్వాతి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అని సొహైల్ పాయింట్ రైజ్ చేయడంతో హర్ట్ అయిన నోయల్ తిరిగి సొహైల్‌నే నామినేట్ చేశాడు.దీంతో ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement