నోయల్ పెట్టిన చిచ్చు బిగ్‌బాస్ హౌస్‌లో బాగానే పనిచేసినట్లు తెలుస్తోంది. నామినేషన్ డే (సోమవారం) రావడంతో హౌస్‌మేట్స్ అంతా నోయల్ వ్యాఖ్యలను బేస్ చేసుకొని నామినేషన్ చేసినట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి అర్థమవుతోంది. ఇందులో నామినేట్ చేయాలనుకున్నవారి తలపై గుడ్డు కొట్టాలని.. ఒక్కొక్కరు ఇద్దరు తలపై గుడ్డు కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించగా.. అమ్మా రాజశేఖర్-అభిజిత్‌ల మధ్య పెద్ద గొడవ జరిగింది. ‘నోయల్ గొడవ చేస్తే నువ్ ఎవడివి? కష్టపడి పైకి వచ్చినోడికి తెలుస్తోంది బాధ.. నీకేం తెలుసు?’ అంటూ అభిజిత్‌పై అమ్మ రాజశేఖర్ ఫైర్ అయ్యాడు. కష్టం.. కష్టం.. ప్రతిసారీ కష్టమేనా? ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు. మీరొక్కరే కాదు.. అంటూ అమ్మా రాజశేఖర్‌పై అభిజిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్ ఏం కష్టపడుతున్నావ్.. చైర్‌లో కూర్చుని బాగా కష్టపడుతున్నావా?? అని మాస్టర్ అనడంతో.. నువ్ అరిస్తే ఎవడూ ఇక్కడ బయపడేటోడు లేడు అంటూ అభిజిత్ గట్టిగానే సమధానం ఇస్తున్నాడు. మొత్తానికి ఈ ఇద్దరి మధ్య గట్టిగానే అవుతోంది.
ఇక ఈ సారి నామినేషన్‌లో మరో విచిత్రం జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా అఖిల్ మోనాల్‌ని నామినేట్ చేశాడు. దీంతో హౌజ్‌మేట్స్ అంతా ఆశ్చర్యపోయారు. మోనాల్‌ని నామినేట్ చేయడం ఏంట్రా అంటూ అమ్మ రాజశేఖర్ నోరెళ్లబెట్టాడు. ఇక అరియానా సోహైల్‌ని నామినేట్ చేయడంతో సోహైల్ కోపంతో ఊగిపోయాడు. ఇంకో గుడ్డు ఉంటే కూడా తీసుకొచ్చి కొట్టు.. హోలీ ఆడుకుందాం అంటూ అరియానాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అక్కడి విషయాలు ఇక్కడ.. ఇక్కడి విషయాలు అక్కడ పెడుతున్నారంటూ సోహైల్ మోనాల్‌ని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది.
కష్టం.. కష్టం.. ప్రతిసారీ కష్టమేనా? : అభిజిత్
Published Mon, Nov 2 2020 3:58 PM | Last Updated on Mon, Nov 2 2020 6:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment