బిగ్‌బాస్‌ బిగ్‌ షాక్‌‌.. వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా అభిజిత్‌ | Bigg Boss 4 Telugu: Bigg Boss Annonce Abhijit Is Worst Performer | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ బిగ్‌ షాక్‌‌.. వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా అభిజిత్‌

Published Fri, Nov 27 2020 10:59 PM | Last Updated on Sat, Nov 28 2020 9:24 AM

Bigg Boss 4 Telugu: Bigg Boss Annonce Abhijit Is Worst Performer - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో‘ రేస్ టు ఫినాలే’ బెల్స్‌ మోగాయి. దీంతో మరోసారి ఇంటి సభ్యుల మధ్య మాట యుద్ధం మొదలైంది. ముఖ్యంగా అభిజిత్‌, అఖిల్‌ల మధ్య లొల్లి మరోసారి తారాస్థాయికి చేరింది. ఇదిలా ఉంటే ‘రేస్ టు ఫినాలే’లో భాగంగా ఇంటి సభ్యులలో మరోసారి అగ్గిరాజేశాడు బిగ్‌బాస్‌. బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరు? వరస్ట్‌ కెప్టెన్‌ ఎవరో ఎంచుకోవాలని ఫిట్టింగ్‌ పెట్టారు. మరి ఇంటి సభ్యులో ఎవరు బెస్ట్‌ కెప్టెన్‌ అయ్యారు. ఎవరు వరస్ట్‌ కెప్టెన్‌ అయ్యారు. అసలు వారిని ఎంపిక చేసే క్రమంలో ఇంటి సభ్యుల్లో ఎలాంటి గొడవ లు జరిగాయో చదివేద్దాం. 

బొక్క బోర్లా పడ్డ అవినాష్‌. 
గార్డెన్‌ ఏరియాలో మోనాల్ ఆసనాలు వేస్తూ తల క్రిందికి చేతులు పైకి పెడితే.. అవినాష్‌ కూడా తానేం తక్కువ కాదన్నట్లుగా వెళ్లి బొక్కబోర్ల పడ్డాడు. అరియానా చెప్పిన వినకుండా ఆసనాల కోసం ట్రై చేసి నవ్వుల పాలయ్యాడు. సొహైల్ అవినాష్‌తో ఆసనాలు వేయిస్తూ దబాంగ్ దబాంగ్ అంటూ బాదుడు బాదేయడం తెగ నవ్వు తెప్పించింది.

అభిజిత్ వరస్ట్  పెర్ఫార్మర్
బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇంటి సభ్యులు నిరాశాజనకమైన ప్రదర్శన ఇచ్చారని బిగ్‌బాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఇది బిగ్ బాస్ ఇళ్లు అని.. బిగ్ బాస్ అనుమతి లేకుండా ఏదీ జరగదన్న విషయం మరిచిపోయారని,  దెయ్యం జలజ మీకు ఇచ్చిన టాస్క్‌లను నిరాకరించారని.. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫార్మర్గా ప్రకటించారు బిగ్ బాస్. ఈ కారణంగా ఇంటి సభ్యులకు ఎటువంటి లగ్జరీ బడ్జెట్ లభించదని కనీసం.. 12 వారాల ప్రయాణం తరువాత అయినా టాస్క్‌ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు బిగ్‌బాస్‌ తెలిపారు. అలాగే ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు  జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు. దీంట్లో భాగంగా అవినాష్‌ తనకు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశానని, రాత్రంతా నిద్రపోలేదని చెప్పుకొచ్చాడు.

‘మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వల్ల నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. ఆ లెటర్‌లో మీరు అఖిల్‌, అభిజిత్‌లు కలిసిన మోనాల్‌ని ఏడిపించారన్న పదాలు నాకు అర్థంకాలేదు.. ఆమెను నేను ఏడిపించాను అంటే పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. అందుకే టాస్క్‌ చేయడానికి నిరాకరించాను. 12వ వారాల జర్నీలో నేను హర్ట్ అయ్యా.. అందుకే దీన్ని పర్సనల్‌గా తీసుకున్నా. ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నా’ అని అభిజిత్ బిగ్‌బాస్‌కు‌ వివరణ ఇచ్చాడు. 

బెస్ట్‌ కెప్టెన్‌గా హారిక
బిగ్ బాస్ హౌస్‌లో రేస్ టు ఫినాలు మొదలైందని.. తిరిగి ఫినాలే వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఉండరని చెప్పారు .  ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇంటి సభ్యులు అందరూ తాము ఎదుర్కొన్న సవాళ్లు, అమలుపరిచిన నియమాలు మరియు ఇంటిని సక్రమంగా నడపడంలో తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారా లేదా అనే విషయాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడున్న మాజీ కెప్టెన్లలో  ఎవరు బెస్ట్ కెప్టెన్.. ఎవరు వరస్ట్ కెప్టెన్ తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశించారు. 

బెస్ట్‌ కెప్టెన్‌ ఎవరో చర్చించే సందర్భంగా ఇంటి సభ్యులు అభిప్రాయాలు ఇలా

సొహైల్.. నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్లిపోయా.కెప్టెన్ కూడా కష్టపడి అయ్యా. ముగ్గురు పోటీదారులతో పోరాడి కెప్టెన్ అయ్యా. నా అంతట నేను ఓన్‌గా కెప్టెన్ అయ్యా

అరియానా: మార్పు నాతోనే మొదలైంది. బాగా కష్టపడి ఇంటి సభ్యులందరి సహకారంతో కెప్టెన్‌ అయ్యా. నా కెప్టెన్సీ స్ట్రిక్ట్‌గా చేశా.. మార్పు నా కెప్టెన్సీతో మొదలైంది.. అదే టైమ్‌లో ఎవరి స్పేస్ వాళ్లకు ఇచ్చా

అఖిల్‌ : నాకు అంత ఈజీగా కెప్టెన్సీ రాలేదు. చాలా కష్టంతో వచ్చింది. ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని బయటకు వెళ్లాక  సీక్రెట్ రూంలో చాలా ఫేస్ చేశా. నేను వచ్చాక లక్ బేస్ మీద కెప్టెన్సీ అయ్యానని అంటున్నారు. కానీ అక్కడ నామినేషన్ ఉంది.. కెప్టెన్సీ ఉంది.. దాంట్లో నాకు కెప్టెన్సీ వచ్చింది. నా కెప్టెన్సీ చాలా స్పూత్‌గా వెళ్లిపోయింది. హారిక.. లీడర్ షిప్‌లో నేను సూపర్. లీడర్ షిప్ స్కిల్స్‌ నాలో చాలా బాగా ఉన్నాయని అనిపించింది. 

ఇక అందరి ఒపినియన్‌ తీసుకున్నాక.. అవినాష్‌, అభిజిత్‌లు హారికను బెస్ట్‌ కెప్టెన్‌గా ఎన్నుకోగా.. సోహైల్‌, అఖిల్‌ ఒకరినొకరుని ఎంచుకున్నారు. ఇక అరియానా అవినాష్‌ని, మోనాల్‌ సోహైల్‌ పేరును చెప్పారు. మొత్తంలో హారిక, సోహైల్‌కి సమానం ఓట్లు(రెండు) రాగా, అరియానా యూటర్న్‌ తీసుకొని హారికను ఎంచుకుంది. దీంతో బెస్ట్‌ కెప్టెన్‌గా హారిక ఎంపికైంది.

వరస్ట్‌ కెప్టెన్‌గా అరియానా
వరస్ట్‌ కెప్టెన్‌ ఎవరనే చర్చలో మొదటగా సోహైల్‌ మాట్లాడాడు. నాకైతే అరియానా వరస్ట్ కెప్టెన్ అనిపిస్తుందని ముఖం మీదనే చెప్పేశాడు. దానికి కారణం చెబుతూ..  ఆమె కెప్టెన్సీలో చాలా టార్చర్ అనుభవించానని చెప్పుకొచ్చాడు.

ఇక అవినాష్‌ని అఖిల్‌ని వరస్ట్ కెప్టెన్ అని చెప్పాడు. పనిష్మెంట్‌ని మోనాల్ విషయంలో అమలు చేయలేదని చెప్పాడు. అయితే అఖిల్‌ ఈ విషయంపై సిరియస్‌ అయ్యాడు. తాను అందరిని సమానంగా చూశానని, ఎవరిపై సింపతీ చూపించలేదన్నాడు. అలాగే తనకు కూడా అవినాషే వరస్ట్‌ కెప్టెన్‌ అని చెప్పేశాడు.  ఇక అరియానా సొహైల్‌ని వరస్ట్ కెప్టెన్ అని చెప్పడంతో సోహైల్‌ ఎప్పటిలాగే అరియానాని హేళన చేస్తూ పిచ్చి పిచ్చి చేష్టలు చేశాడు. 
 

ఇక అభిజిత్.. అఖిల్‌ని వరస్ట్ కెప్టెన్ అని, లక్ కొద్దీ కెప్టెన్ అయ్యాడని చెప్తుండగా.. అఖిల్ ఈ సోది కబుర్లు వద్దు.. ముందునుంచి నేను వరస్ట్ అని ఉంది నీకు అదే చెప్పెయ్ అంటూ కౌంటర్‌ ఇచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య రచ్చ రేగుతుండగా.. సొహైల్ వచ్చి మళ్లీ ఎటో పోతుంది ఇది.. ఆపండి అని అనడంతో.. ఎటు పోతుంద్రా ఆగరా నువ్ అంటూ సొహైల్‌‌పై అఖిల్‌ సీరియస్‌ అయ్యాడు. ఇక అభి సైలెంట్‌ కావడంతో ఆ గొడవ అక్కడితో సద్దుమనిగింది. మొత్తంగా వరస్ట్ కెప్టెన్‌‌గా అరియానా పేరుని ఫైనల్ చేశారు.

అలిగిన అరియానా.. సారీ చెప్పిన అవినాష్‌
ఏమైందో ఏమో కానీ అవినాష్‌పై అరియానా అలిగింది. కాసేపు మాట్లాడలేదు. దీంతో అవినాషే ఒక అడుగు ముందుకేసి అరియానాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు.ఏమైందని అరియానా అని అవినాష్‌ అడగ్గా.. నువ్ వెర్రిపప్ప అవ్వడం నాకు ఇష్టం లేదు.. నీతో మాట్లాడటానికి టైం పడుతుందని చెప్పింది. దీంతో అవినాష్‌ గుడ్‌నైట్‌ చెప్పి తన బెడ్‌పైకి వెళ్లి నిద్రపోయాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement