స్క్రీన్‌ టెస్ట్‌ | Screen Test | Sakshi
Sakshi News home page

స్క్రీన్‌ టెస్ట్‌

Published Tue, Sep 5 2017 12:19 AM | Last Updated on Sun, Sep 17 2017 6:23 PM

స్క్రీన్‌ టెస్ట్‌

స్క్రీన్‌ టెస్ట్‌

 ► లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ సినిమాలో విలన్‌ గ్యాంగ్‌లో చిన్న పాత్ర పోషించిన నటుడు ఇప్పుడు టాలీవుడ్‌లో çసక్సెస్‌ఫుల్‌ హీరో అతనెవరో తెలుసా?
ఎ) నిఖిల్‌     బి) రాజ్‌తరుణ్‌ సి) విజయ్‌ దేవరకొండ డి) నాగశౌర్య

 ► చంద్రముఖి’ డైరెక్టర్‌ పి.వాసు ప్రముఖ మేకప్‌మేన్‌ కుమారుడు. ఆయన పేరేంటి?
ఎ) మాధవరావు బి) పీతాంబరం సి) మేకప్‌ బాబు డి) మేకప్‌ శీను

► పధ్నాలుగేళ్లుగా సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న నయనతార మొదట ఏ హీరోతో జతకట్టారు?
ఎ) మమ్ముట్టి   బి) రజనీకాంత్‌సి) శరత్‌కుమార్‌డి) జయరామ్‌

 ► పరుగు ఆపటం ఓ కళ..’ పేరుతో ఈ సినీ హీరో జీవిత చరిత్రను ఆకెళ్ల రాఘవేంద్ర రచించారు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం?
ఎ) కృష్ణ   బి) శోభన్‌బాబుసి) అక్కినేని నాగేశ్వరరావు డి) ఎస్వీ రంగారావు
 
► కృష్ణ నటించిన వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఆ సినిమా 70 శాతం పూర్తయ్యాక ఆ దర్శకుడు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడా సినిమాని కృష్ణ, విజయనిర్మల పూర్తిచేశారు. 70 శాతం కంప్లీట్‌ చేసిన ఆ దర్శకుడెవరు?
ఎ) ఆదుర్తి సుబ్బారావు బి) వి. రామచంద్రరావు సి) సాంబశివరావు డి) లక్ష్మిదీపక్‌

 ► టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్లు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, కె.ఎస్‌. రవికుమార్‌ చౌదరి ఈ దర్శకుడి శిష్యులు?
ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) సాగర్‌ డి) ముత్యాల సుబ్బయ్య

 ► గాయని సునీత 800 పైచిలుకు సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. ఆమె డబ్బింగ్‌ ప్రస్థానం ఏ సినిమాతో మొదలైందో తెలుసా?
ఎ) పెళ్లి   బి) గులాబి సి) అనగనగా ఒకరోజుడి) పెళ్లి పందిరి

 ► ‘మిర్చి’ సినిమాలో ‘పండగలా దిగివచ్చాడు..’ పాట రాసింది రామజోగయ్యశాస్త్రి. మరి, పాడింది ఎవరు?
ఎ) హరిహరన్‌ బి) శంకర్‌ మహదేవన్‌  సి) శ్రీరామచంద్రడి) కైలాష్‌ ఖేర్‌

 ► దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్‌ 10. అదే రోజున ఓ ప్రముఖ కమెడియన్‌ పుట్టినరోజు కూడా. అతనెవరో
ఊహించండి..

ఎ) వేణుమాధవ్‌   బి) అలీ సి) బ్రహ్మానందం డి) జయప్రకాశ్‌రెడ్డి

 ► సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏ సంగీత దర్శకుని వద్ద శిష్యరికం చేశారు?
ఎ) కె.వి. మహదేవన్‌ బి) ఇళయరాజా సి) ఎమ్మెస్‌ విశ్వనాథన్‌ డి) చక్రవర్తి

 ► ‘నాకు అదో తుత్తి’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్యనటుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన కామెడీతో మనసుల్లో నిలిచిపోయారు. ఆయన ఎవరు?
ఎ) ఏవీఎస్‌      బి) కొండవలస సి) ధర్మవరపు సుబ్రహ్మణ్యం డి) ఎమ్మెస్‌ నారాయణ

 ► దాసరి దర్శకత్వంలో హీరోగా నటించిన ఆ నటుడు ఆ తర్వాత పెద్ద రచయిత. ఇప్పుడు ఒక స్టార్‌ హీరో సినిమా ద్వారా దర్శకుడు కాబోతున్నారు.. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం.
ఎ) సురేందర్‌ రెడ్డి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీడి) కాశీ విశ్వనాథ్‌

 ► భాష రాని కారణంగా మహేశ్‌బాబు సరసన బాలీవుడ్‌ భామ పరిణీతి చోప్రా ‘స్పైడర్‌’లో నటించే ఛాన్స్‌ కోల్పోయింది. ఆ అవకాశం ఎవరికి దక్కిందో ఈజీగానే చెప్పేస్తారు కదూ?
ఎ) తమన్నా  బి) తాప్సీ సి) పూజాహెగ్డే డి) రకుల్‌ ప్రీత్‌సింగ్‌

 ► ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు సాధిస్తున్న ఈ యువహీరో ఇద్దరు లేడీ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. అతడెవరు?
ఎ) సిద్ధార్థ్‌   బి) నారా రోహిత్‌ సి) వరుణ్‌సందేశ్‌ డి) నాని

 ► ఏడుసార్లు నంది అవార్డు గెలుచుకున్న తెలుగు అగ్ర హీరో ఎవరో తెలుసా?
ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేష్‌

 ► ఈ ఫొటోలోని బుడతణ్ణి గుర్తుపట్టారా? చిన్న క్లూ.. మీరు ‘గజిని’ కాదులెండి.
ఎ) ధనుష్‌   బి) సూర్యసి) అజిత్‌ డి) శింబు

 ► హీరోలు గాల్లో పల్టీలు కొడుతూ ఫైట్‌ చేస్తుంటారు. థ్రిల్‌కి గురి చేసే ఈ ఫైట్‌ కంపోజ్‌ చేయడాన్ని టెక్నికల్‌గా ఏమంటారో తెలుసా?
ఎ) వైర్‌ వర్క్‌   బి) రోప్‌ వర్క్‌ సి) స్ట్రింగ్‌ రిమూవల్‌డి) స్ట్రింగ్‌ ఫైట్‌

 ► అల్లు అర్జున్‌ ట్విట్టర్‌ ఐడీ ఏంటో కనుక్కోండి చూద్దాం?
ఎ) ఐయామ్‌ అల్లు బి) ఐయామ్‌ బన్నీ సి) అల్లు అర్జున్‌ డి) యువర్స్‌ బన్నీ

 ► ఈ స్టిల్‌ ఏ సినిమాలోనిది?
ఎ) మిస్సమ్మ బి) గుండమ్మ కథ సి) తోడి కోడళ్లు డి) మూగ మనసులు
 
► మహేశ్‌బాబు ఈ సినిమాలో సుపారీ (డబ్బు) తీసుకుని, షూటర్‌గా చేస్తాడు. అదే సినిమా?
ఎ) ఖలేజా    బి) అతడు సి) బిజినెస్‌మేన్‌డి) పోకిరి

మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం     
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే...  మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్‌
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే...   ఇంకోసారి ఈ క్విజ్‌ చదవకండి!


సమాధానాలు
1) సి 2) బి 3) డి 4) బి5) బి 6) సి 7) డి 8) డి 9) బి10) డి 11) ఎ 12) సి 13) డి14) డి 15) డి 16) బి 17) సి18) సి 19) ఎ20) బి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement