Villain gang
-
స్క్రీన్ టెస్ట్
► లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో చిన్న పాత్ర పోషించిన నటుడు ఇప్పుడు టాలీవుడ్లో çసక్సెస్ఫుల్ హీరో అతనెవరో తెలుసా? ఎ) నిఖిల్ బి) రాజ్‌తరుణ్ సి) విజయ్ దేవరకొండ డి) నాగశౌర్య ► చంద్రముఖి’ డైరెక్టర్ పి.వాసు ప్రముఖ మేకప్‌మేన్ కుమారుడు. ఆయన పేరేంటి? ఎ) మాధవరావు బి) పీతాంబరం సి) మేకప్ బాబు డి) మేకప్ శీను ► పధ్నాలుగేళ్లుగా సౌత్‌లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార మొదట ఏ హీరోతో జతకట్టారు? ఎ) మమ్ముట్టి బి) రజనీకాంత్సి) శరత్కుమార్డి) జయరామ్ ► పరుగు ఆపటం ఓ కళ..’ పేరుతో ఈ సినీ హీరో జీవిత చరిత్రను ఆకెళ్ల రాఘవేంద్ర రచించారు. ఆ హీరో ఎవరో చెప్పుకోండి చూద్దాం? ఎ) కృష్ణ బి) శోభన్బాబుసి) అక్కినేని నాగేశ్వరరావు డి) ఎస్వీ రంగారావు ► కృష్ణ నటించిన వందో చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. ఆ సినిమా 70 శాతం పూర్తయ్యాక ఆ దర్శకుడు అనారోగ్యం పాలయ్యారు. అప్పుడా సినిమాని కృష్ణ, విజయనిర్మల పూర్తిచేశారు. 70 శాతం కంప్లీట్ చేసిన ఆ దర్శకుడెవరు? ఎ) ఆదుర్తి సుబ్బారావు బి) వి. రామచంద్రరావు సి) సాంబశివరావు డి) లక్ష్మిదీపక్ ► టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు వీవీ వినాయక్, శ్రీను వైట్ల, కె.ఎస్. రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి శిష్యులు? ఎ) దాసరి నారాయణరావు బి) కె.రాఘవేంద్రరావు సి) సాగర్ డి) ముత్యాల సుబ్బయ్య ► గాయని సునీత 800 పైచిలుకు సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. ఆమె డబ్బింగ్ ప్రస్థానం ఏ సినిమాతో మొదలైందో తెలుసా? ఎ) పెళ్లి బి) గులాబి సి) అనగనగా ఒకరోజుడి) పెళ్లి పందిరి ► ‘మిర్చి’ సినిమాలో ‘పండగలా దిగివచ్చాడు..’ పాట రాసింది రామజోగయ్యశాస్త్రి. మరి, పాడింది ఎవరు? ఎ) హరిహరన్ బి) శంకర్ మహదేవన్ సి) శ్రీరామచంద్రడి) కైలాష్ ఖేర్ ► దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పుట్టినరోజు అక్టోబర్ 10. అదే రోజున ఓ ప్రముఖ కమెడియన్ పుట్టినరోజు కూడా. అతనెవరో ఊహించండి.. ఎ) వేణుమాధవ్ బి) అలీ సి) బ్రహ్మానందం డి) జయప్రకాశ్‌రెడ్డి ► సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఏ సంగీత దర్శకుని వద్ద శిష్యరికం చేశారు? ఎ) కె.వి. మహదేవన్ బి) ఇళయరాజా సి) ఎమ్మెస్ విశ్వనాథన్ డి) చక్రవర్తి ► ‘నాకు అదో తుత్తి’ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హాస్యనటుడు ఇప్పుడు మన మధ్య లేకపోయినా తన కామెడీతో మనసుల్లో నిలిచిపోయారు. ఆయన ఎవరు? ఎ) ఏవీఎస్ బి) కొండవలస సి) ధర్మవరపు సుబ్రహ్మణ్యం డి) ఎమ్మెస్ నారాయణ ► దాసరి దర్శకత్వంలో హీరోగా నటించిన ఆ నటుడు ఆ తర్వాత పెద్ద రచయిత. ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా ద్వారా దర్శకుడు కాబోతున్నారు.. ఆయనెవరో చెప్పుకోండి చూద్దాం. ఎ) సురేందర్ రెడ్డి బి) కొరటాల శివ సి) వక్కంతం వంశీడి) కాశీ విశ్వనాథ్ ► భాష రాని కారణంగా మహేశ్‌బాబు సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా ‘స్పైడర్’లో నటించే ఛాన్స్ కోల్పోయింది. ఆ అవకాశం ఎవరికి దక్కిందో ఈజీగానే చెప్పేస్తారు కదూ? ఎ) తమన్నా బి) తాప్సీ సి) పూజాహెగ్డే డి) రకుల్ ప్రీత్‌సింగ్ ► ఇప్పుడు వరుసగా హిట్లు మీద హిట్లు సాధిస్తున్న ఈ యువహీరో ఇద్దరు లేడీ డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. అతడెవరు? ఎ) సిద్ధార్థ్ బి) నారా రోహిత్ సి) వరుణ్‌సందేశ్ డి) నాని ► ఏడుసార్లు నంది అవార్డు గెలుచుకున్న తెలుగు అగ్ర హీరో ఎవరో తెలుసా? ఎ) చిరంజీవి బి) బాలకృష్ణ సి) నాగార్జున డి) వెంకటేష్ ► ఈ ఫొటోలోని బుడతణ్ణి గుర్తుపట్టారా? చిన్న క్లూ.. మీరు ‘గజిని’ కాదులెండి. ఎ) ధనుష్ బి) సూర్యసి) అజిత్ డి) శింబు ► హీరోలు గాల్లో పల్టీలు కొడుతూ ఫైట్ చేస్తుంటారు. థ్రిల్‌కి గురి చేసే ఈ ఫైట్ కంపోజ్ చేయడాన్ని టెక్నికల్‌గా ఏమంటారో తెలుసా? ఎ) వైర్ వర్క్ బి) రోప్ వర్క్ సి) స్ట్రింగ్ రిమూవల్డి) స్ట్రింగ్ ఫైట్ ► అల్లు అర్జున్ ట్విట్టర్ ఐడీ ఏంటో కనుక్కోండి చూద్దాం? ఎ) ఐయామ్ అల్లు బి) ఐయామ్ బన్నీ సి) అల్లు అర్జున్ డి) యువర్స్ బన్నీ ► ఈ స్టిల్ ఏ సినిమాలోనిది? ఎ) మిస్సమ్మ బి) గుండమ్మ కథ సి) తోడి కోడళ్లు డి) మూగ మనసులు ► మహేశ్‌బాబు ఈ సినిమాలో సుపారీ (డబ్బు) తీసుకుని, షూటర్‌గా చేస్తాడు. అదే సినిమా? ఎ) ఖలేజా బి) అతడు సి) బిజినెస్మేన్డి) పోకిరి మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) సి 2) బి 3) డి 4) బి5) బి 6) సి 7) డి 8) డి 9) బి10) డి 11) ఎ 12) సి 13) డి14) డి 15) డి 16) బి 17) సి18) సి 19) ఎ20) బి -
ఇండస్ట్రీకి వస్తానంటే... వద్దనే చెబుతాను!
సంభాషణం చాలా సినిమాల్లో విలన్ గ్యాంగులో రౌడీగా కనిపిస్తాడతను. కానీ ముఖం అమాయకత్వానికి కేరాఫ్ అడ్రస్‌లా ఉంటుంది. చేసే పనులూ, మాట్లాడే మాటలూ అమాయకంగానే ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. రౌడీ పాత్రలో కామెడీని పండించే ఆ నటుడి పేరు... ‘ఫిష్’ వెంకట్. ‘గబ్బర్‌సింగ్’లో ‘క్షందమామ రావే’ అంటూ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన వెంకట్ చెప్పిన విశేషాలివి... ఆంధ్ర, తెలంగాణ సెగను కొందరు పరిశ్రమకు కూడా తగిలిస్తున్నారు. నాకది నచ్చడం లేదు. నేను తెలంగాణవాడినే. అయినా కూడా ఆంధ్రవాళ్లమీద నాకే అయిష్టమూ లేదు. ఇక్కడ పరిశ్రమను నెలకొల్పింది, నిలబెట్టింది, నాలాంటి వాళ్లందరికీ అవకాశాలూ కల్పించిందీ వాళ్లే. వాళ్లు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అసలు పరిశ్రమ రెండు ముక్కలవ్వాల్సిన అవసరమూ లేదు. ఆ ఆలోచనే నాకు బాధ కలిగిస్తుంది. విభేదాలు లేకుండా ఎప్పటిలా అందరం కలిసి ఒకేచోట, ఒక్కటిగా ఉండి పని చేసుకోవాలన్నదే నా కోరిక. మిమ్మల్ని ‘ఫిష్’ వెంకట్ అని ఎందుకంటారు? మేం బెస్తవాళ్లం. చేపల వ్యాపారం చేసేవాళ్లం. అందుకే అందరూ అలా పిలుస్తుంటారు. మరి ‘ఫిష్’ను వదిలి ‘ఫిల్మ్’ని ఎందుకు నమ్ముకున్నారు? మేం ముషీరాబాద్‌లో ఉండేవాళ్లం. 1980లో శ్రీహరిగారి కుటుంబం హైదరాబాద్ వచ్చి బాలానగర్‌లో స్థిరపడింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆయన సినిమాల్లోకి వెళ్లాక తన షూటింగులకు వెళ్లేవాడిని. ఆయనే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు. నేను రానన్నా బలవంతపెట్టి ‘ఒరేయ్ తమ్ముడు’లో నటింపజేశారు. బ్రేక్ ఎప్పుడు వచ్చింది? ‘ఆది’ సినిమాతో. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చింది శ్రీహరన్న అయితే... నిలదొక్కుకునేలా చేసింది వీవీ వినాయక్‌గారు. ఆయన నాకు గాడ్‌ఫాదర్. ఆది, బన్ని సినిమాల్లో మంచి పాత్రలిచ్చి నేనెవరో అందరికీ తెలిసేలా చేశారు. ఎన్ని జన్మలెత్తినా ఈ ఇద్దరి రుణం నేను తీర్చుకోలేను. ఎప్పుడూ ఒకేలాంటి పాత్రలు చేస్తున్నారు. బోర్ కొట్టడం లేదా? ఫిష్ వెంకట్ ఎలాంటి పాత్రలకు సూటవుతాడో, ఏం చేస్తే బాగుంటాడో రచయితలకి, దర్శకులకి తెలుసు. వారి నమ్మకమే నాకు బలం. నేను చిన్నతనం నుంచీ చాలా కష్టాలు పడ్డాను. ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నాకు లభించిన పాత్రలే. అందుకే ఏ పాత్రనయినా చేస్తాను. రెమ్యునరేషన్ కూడా ఇంత కావాలి అని అడగను. ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. మిమ్మల్ని రౌడీ పాత్రల్లో చూసి మీ వాళ్లేమంటారు? నేను రౌడీ గ్యాంగ్‌లో ఉన్నా చేసేది కామెడీయే కదా. వాళ్ల మధ్య ఉండి వాళ్లమీదే సెటైర్లు వేస్తుంటాను. అది చూసి నా భార్యలు, పిల్లలు నవ్వుతుంటారు. మీరు భార్యలు అనే అన్నారా? అవునండీ... మీరు విన్నది నిజమే. నాకు ఇద్దరు భార్యలు, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పాపకి పెళ్లి చేసేశాం. పెదబాబు యాదేష్ ‘వీడు తేడా’, ‘ప్రేమ ఒక మైకం’, ‘డి ఫర్ దోపిడీ’ చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేశాడు. రెండో బాబు సాయి పదో తరగతి చదువుతున్నాడు. తనని హీరోని చేయాలని నా కోరిక. మూడోవాడు ఇంకా చిన్నోడే. వాడి గురించి ఆలోచించడానికి చాలా టైముంది. వాళ్లనీ మీ దారిలోనే నడిపిస్తున్నారా? అవును. కానీ బయటివాళ్లెవరు ఇండస్ట్రీకి వస్తానన్నా వద్దంటాను. ఎందుకని? ఇక్కడ రోజూ రెండు వందల మంది వేషాల కోసం క్యూలో నిలబడతారు. ఓ పది మందికి మాత్రమే పని దొరుకుతుంది. మిగతా నూట తొంభై మందీ వెనుదిరగాల్సిందే. పని దొరికినా కంటిన్యుయస్‌గా ఉండదు. కొన్నాళ్లు ఖాళీగా ఉండాలి. వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రం. ఎలా బతుకుతారు? సినిమాల మీద ఆసక్తితో కండలు, జుట్లు పెంచుకుని వచ్చినంత మాత్రాన ఇక్కడ పిలిచి అవకాశాలెవరూ ఇచ్చేయరు. అదేదో నెలకు మూడు నాలుగు వేలు వచ్చే ఉద్యోగం చేసినా కుటుంబాన్ని పోషించుకోవచ్చు. మీరిలా మాట్లాడ్డం ఆశ్చర్యంగా ఉంది... ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అందరికీ నాకు దొరికినట్టు ఓ శ్రీహరి, ఓ వినాయక్ దొరకరు. అవకాశాలు దొరికేలోపు యేళ్లకేళ్లు గడిచిపోతాయి. ఇండస్ట్రీ పట్ల అసంతృప్తి ఉన్నట్టుందే? లేదు. నన్ను నిలబెట్టింది, బతికిస్తోంది ఈ పరిశ్రమే. కాకపోతే అందరికీ అంత అదృష్టం దక్కదు. అందుకే దీనిమీదే ఆశలు పెంచుకుని జీవితాన్ని పాడు చేసుకోవద్దంటున్నాను. కావాలంటే ఏదైనా పని చేసుకుంటూ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఈ పరిశ్రమ గొప్పది. ఇక్కడ ఎంతమందికైనా చోటుంటుంది. కాకపోతే ఆ చోటు సంపాదించుకోవడం కాస్త కష్టం. అందరికీ నా అంత అదృష్టం ఉండదుగా! - సమీర నేలపూడి