సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. 2015 నుంచి 2018 వరకు రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రం ఏడవ ర్యాంకులో ఉండగా 2019లో 8వ ర్యాంకులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదాలపై కేంద్రం ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయం స్పష్టం చేసింది. 2018లో రాష్ట్రంలో 24,727 రోడ్డు ప్రమాదాలు జరిగితే 2019లో 21,992 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 2018తో పోల్చితే 2,483 ప్రమాదాలు తగ్గాయన్నమాట. 2018తో పోల్చితే రోడ్డు ప్రమాదాలు తగ్గిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్ ఉన్నాయి. కాగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను ఇంకా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అదనపు కమిషనర్ ప్రసాదరావు తెలిపారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వివరాలు
ఏడాది | ప్రమాదాల సంఖ్య | ర్యాంకు |
2015 | 24,258 | 7 |
2016 | 24,888 | 7 |
2017 | 25,727 | 7 |
2018 | 24,475 | 7 |
2019 | 21,992 | 8 |
ఐదు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల తగ్గుదల ఇలా..
రాష్ట్రం | 2018 | 2019 | తగ్గుదల |
తమిళనాడు | 63,920 | 57,228 | 6,692 |
మహారాష్ట్ర | 35,717 | 32,925 | 2,792 |
పశ్చిమబెంగాల్ | 12,705 | 10,158 | 2,547 |
ఆంధ్రప్రదేశ్ | 24,475 | 21,992 | 2,483 |
గుజరాత్ | 18,769 | 17,046 | 1,723 |
Comments
Please login to add a commentAdd a comment