
సాక్షి, మైలవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 138వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా ముత్యాలంపాడు శివారు నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానికులు పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆత్కూరు మీదుగా చెవుటూరు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు.
మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కుంటముక్కల క్రాస్, గుర్రాజు పాలెం మీదుగా మైలవరం చేరుకొని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment