Mutyalampadu
-
1.08 లక్షల కిలోల బియ్యంతో తండులాభిషేకం
మధురానగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని లోక కల్యాణార్ధం 1.08 లక్షల కిలోల బియ్యంతో బాబాకు విశేషంగా అభిషేకం (తండులాభిషేకం) జరిగింది. ఉదయం తండులాభిషేకాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సుమారు 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు నూతన సంవత్సర క్యాలెండర్లు, ప్రసాదాన్ని అందజేశారు. తండులాభిషేకాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో నమోదు చేసి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చేతులమీదుగా మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. బాబాను మంత్రి వెలంపల్లి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి దర్శించుకున్నారు. తండులాభిషేకంకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను మంత్రి వెలంపల్లి చేతుల మీదుగా అందజేస్తున్న దృశ్యం -
138వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
-
ముత్యాలంపాడు నుంచి ప్రజాసంకల్పయాత్ర
సాక్షి, మైలవరం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 138వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఆయన కృష్ణాజిల్లా ముత్యాలంపాడు శివారు నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. వైఎస్ జగన్‌కు మద్దతుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు, స్థానికులు పాదయాత్రలో పాల్గొన్నారు. అక్కడ నుంచి ఆత్కూరు మీదుగా చెవుటూరు చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలసుకుంటూ ముందుకు సాగనున్నారు. కుంటముక్కల క్రాస్, గుర్రాజు పాలెం మీదుగా మైలవరం చేరుకొని బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. -
‘పంటనష్టోయిన రైతులకు పరిహారం చెల్లించాలి’
-
‘పంటనష్టోయిన రైతులకు పరిహారం చెల్లించాలి’
విజయవాడ : వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నుంచి రూ.20 పరిహారం ఇవ్వాలని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన సోమవారం పర్యటించారు. అనంతరం వైఎస్ జగన్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారని, అయితే అంతకంటే ఎక్కువే నష్టం జరిగి ఉండచ్చొన్నారు. గతేడాది ఇన్పుట్ సబ్సిడీ ఇంకా ఇవ్వలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మాఫీ కాని రుణాలకు రూ.2 వరకూ వడ్డీ చెల్లిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే బంగారంపై రైతులకు లోన్లు ఇవ్వొద్దని చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పులిచింతల ప్రాజెక్ట్ పూర్తయినా ప్రభుత్వం పూర్తిస్థాయిలో నీళ్లు నింపలేని పరిస్థితిలో ఉందన్నారు. 45 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉన్నా కేవలం 30 టీఎంసీలే నిల్వ ఉంచుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి పునరావాసం కింద రూ.150 కోట్లు ఇస్తే పూర్తిస్థాయిలో నీరు నిల్వ చేసుకోవచ్చన్నారు. ఇటు కృష్ణా నుంచి 19 టీఎంసీలు, అటు గోదావరి నుంచి రోజుకు 26 టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని వైఎస్ జగన్ అన్నారు. -
చంద్రబాబు ఆకాశంలో చక్కెర్లు కొట్టడం కాదు...
-
చంద్రబాబు ఆకాశంలో చక్కెర్లు కొట్టడం కాదు...
గుంటూరు : వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఆయన గుంటూరు జిల్లా ముత్యాలంపాడులో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...వరుసగా వర్షాలు పడ్డాయని, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వర్షాలు, వరదలతో రైతుల దారుణంగా దెబ్బతింటే... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పైపైన పరిశీలించి వెళ్లిపోయారన్నారు. జూలై చివరి నుంచి ఆగస్ట్ చివర వరకూ వర్షాలు పడలేదని, అప్పుడు చచ్చిచెడీ రైతులు పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తే... ఈ రెండు నెలలు వర్షాలు ముంచెత్తాయన్నారు. చేతికి వస్తుందనుకున్న పంట చివరికి వరుణుడి పాలైందన్నారు. గత ఏడాది ఇన్‌ఫుట్ సబ్సిడీ కూడా ఇంతవరకూ రైతులకు అందలేదన్నారు. రైతుకు రూపాయి చేతికి అందలేదని వైఎస్ జగన్ అన్నారు. ఓ పక్క రుణాలు మాఫీ కాక, మరోవైపు కొత్త రుణాల కోసం రైతులు బ్యాంకులకు వెళితే మంజూరు కానీ పరిస్థితి నెలకొందన్నారు. పైగా బంగారంపై రుణాలు ఇవ్వొద్దని చంద్రబాబే చెపుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రెండు, మూడు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చినా పంట చేతికందని పరిస్థితి నెలకొంది. జిల్లాకు 120 కోట్లు ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉందని వైఎస్ జగన్ అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన చంద్రబాబు... విమానాల్లో తిరుగుతూ ఆకాశంలో చక్కెర్లు కొడుతున్నారని, ఇప్పటికైన భూమికి దిగి రైతుల పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. ఇక కష్టాల్లో ఉన్న రైతుల వద్దకు వచ్చే నాథుడు కూడా లేడని, కనీసం అధికారి కూడా గ్రామానికి వచ్చిన దాఖలాలు లేవన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. నష్ట పోయిన పంట పొలాలను నేరుగా వచ్చి పరిశీలించి.. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు అండగా నిలవాలన్నారు. -
16న చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు
విజయవాడ (మధురానగర్) : ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ జింఖానా గ్రౌండ్లో శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారు భక్తులకు మంగళశాసనములు అందజేయనున్నారని శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరి తెలిపారు. ముత్యాలంపాడులో శనివారం శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ఆశీర్వచనాలు, అనుగ్రహ భాషణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీచిన్న జీయర్ స్వామివారు, అహోబిల రామానుజజీయర్ స్వామివార్లు చాతుర్మాస వ్రత పరిసమాప్తి అయిన వెంటనే భక్తులకు మంగళ శాసనములు అందజేయటానికి విచ్చేస్తున్నారన్నారు. 16వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారన్నారు. విచ్చేసే భక్తులందరికీ శ్రీకనకదుర్గ అమ్మవారు, ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) వేంకటేశ్వరస్వామివార్ల ప్రసాదంను అందజేస్తామన్నారు.