16న చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు
16న చిన్నజీయర్ స్వామి ఆశీర్వచనాలు
Published Sat, Sep 10 2016 11:24 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM
విజయవాడ (మధురానగర్) : ఈ నెల 16వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు గాంధీనగర్ జింఖానా గ్రౌండ్‌లో శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామివారు భక్తులకు మంగళశాసనములు అందజేయనున్నారని శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ మండలి కన్వీనర్ మందలపర్తి సత్యశ్రీహరి తెలిపారు. ముత్యాలంపాడులో శనివారం శ్రీత్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ఆశీర్వచనాలు, అనుగ్రహ భాషణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ శ్రీచిన్న జీయర్ స్వామివారు, అహోబిల రామానుజజీయర్ స్వామివార్లు చాతుర్మాస వ్రత పరిసమాప్తి అయిన వెంటనే భక్తులకు మంగళ శాసనములు అందజేయటానికి విచ్చేస్తున్నారన్నారు. 16వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తారన్నారు. విచ్చేసే భక్తులందరికీ శ్రీకనకదుర్గ అమ్మవారు, ద్వారకాతిరుమల (చిన్న తిరుపతి) వేంకటేశ్వరస్వామివార్ల ప్రసాదంను అందజేస్తామన్నారు.
Advertisement
Advertisement