![Sai Baba Temple Registered in the Wonder Book of Records International - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/2/goutam.jpg.webp?itok=G5zxzOVm)
బాబాకు తండులాభిషేకం చేస్తున్న గౌతంరెడ్డి
మధురానగర్(విజయవాడ సెంట్రల్): విజయవాడ ముత్యాలంపాడు శ్రీషిర్డీసాయిబాబా మందిరంలో శనివారం ఆంగ్ల సంవత్సరాది పురస్కరించుకుని లోక కల్యాణార్ధం 1.08 లక్షల కిలోల బియ్యంతో బాబాకు విశేషంగా అభిషేకం (తండులాభిషేకం) జరిగింది. ఉదయం తండులాభిషేకాన్ని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి ప్రారంభించారు.
ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు సుమారు 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు నూతన సంవత్సర క్యాలెండర్‌లు, ప్రసాదాన్ని అందజేశారు. తండులాభిషేకాన్ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్‌లో నమోదు చేసి దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చేతులమీదుగా మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. బాబాను మంత్రి వెలంపల్లి, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ రెడ్డి దర్శించుకున్నారు.
తండులాభిషేకంకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ సర్టిఫికెట్‌ను మంత్రి వెలంపల్లి చేతుల మీదుగా అందజేస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment