వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఆయన గుంటూరు జిల్లా ముత్యాలంపాడులో వరద వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను వైఎస్ జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...వరుసగా వర్షాలు పడ్డాయని, పత్తి, మిరప పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల పంటకు నష్టం వాటిల్లిందన్నారు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
Published Mon, Sep 26 2016 4:48 PM | Last Updated on Thu, Mar 21 2024 9:01 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement