కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : జిల్లాలోని మైలవరం డ్యామ్‌కు అవుకు రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బి. అరవిందరెడ్డి మెమో నెంబర్ 25789/డబ్ల్యుఆర్‌జి/2013 ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మైలవరం జలాశయానికి నీటిని విడుదల చేయాలని త ద్వారా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు, ఆర్‌టిపిపి నీటి అవసరాలు తీర్చాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నవంబర్ 21న విన్నవించారు. ఆ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రభుత్వం 2 టీఎంసీలు నీటి విడుదలకు ఆమోదం తెలిపింది. ఇదే విషయమై ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో పాటు, రాష్ట్ర యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
మైలవరానికి 2 టీఎంసీల నీరు
Published Sun, Jan 5 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement