మైలవరం:
అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్సార్ జిల్లా మైలవరం మండలపరి«ధిలోని ముర్రపంది పంచాయతీ నక్కవానిపల్లెలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నక్క రాంమోహన్ (28) అను రైతు తనకున్న రెండు ఎకరాలతో పాటు గుత్తకు 3 ఎకరాల భూమి తీసుకుని సాగు చేస్తున్నాడు. పంట చేతికి అందకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. పంటల సాగు కోసం దాదాపు రూ.6 లక్షల దాక అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక జీవితంపై విరక్తి చెంది పంట చేను దగ్గరే రామోహన్ పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతనిని చికిత్స కోసం జమ్మలమడుగు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నారు. మైలవరం ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి కేసు నమోదు చేశారు.