
‘మంత్రి దేవినేని ఉమ బ్రోకర్’
విజయవాడ: ఏపీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి జోగి రమేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంటాక్టర్ల నుంచి డబ్బులు గుంజుతూ కమిషన్ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులకు లేదని అన్నారు.
‘దేవినేని ఉమ ఓ పిట్టలదొర. ఇరిగేషన్ మంత్రిగా పనికిరారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. వైఎస్ జగన్ ప్రజల తరపు పోరాడే వ్యక్తి. ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మైలవరానికి తాగునీళ్లు ఇవ్వలేని నువ్వు సొల్లుకబుర్లు చెబుతున్నావు. మంచినీళ్లు ఇవ్వలేని దద్దమ్మవు సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు. పెదబాబుకు ఇంత, చినబాబుకు ఇంత, నీకు ఇంత అని కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు దండుకునే బ్రోకర్‌వి. పోలవరం ప్రాజెక్టుపై ఎక్కడైనా చర్చకు సిద్ధం. చంద్రబాబు మనసులో వైఎస్ రాజశేఖరరెడ్డిని తలచుకుంటే చేసిన పాపాలు సగమైనా పోతాయ’ని జోగి రమేశ్ అన్నారు.