'2019 నాటికి పోలవరం పూర్తీకి బాబు సంకల్పం' | By 2019, the launches will complete POLAVARAM says devineni | Sakshi
Sakshi News home page

'2019 నాటికి పోలవరం పూర్తీకి బాబు సంకల్పం'

Published Sun, May 24 2015 7:19 PM | Last Updated on Tue, Mar 19 2019 7:01 PM

By 2019, the launches will complete POLAVARAM says devineni

అన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) : పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అన్నవరంలో ఆదివారం జరిగిన టీడీపీ తూర్పు గోదావరి జిల్లా మినీ మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.వంద కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్రం సీఎం పట్టుదలతో మరో రూ.900 కోట్లు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసిందన్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పథకం వలన రాయలసీమకు నీరందుతుందని, అది ఇష్టం లేని కొందరు ఈ పథకం వలన ఉభయ గోదావరి జిల్లాలు ఎడారిగా మారుతాయంటూ రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement