తంగిరాల నిస్వార్థ నేత | Blossom selfless leader | Sakshi
Sakshi News home page

తంగిరాల నిస్వార్థ నేత

Published Mon, Jun 30 2014 2:10 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

Blossom selfless leader

  •  సంతాపసభలో పలువురు వక్తలు
  • నందిగామ : తంగిరాల  ప్రభాకరరావు పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎనలేని సేవ చేశారని ఆయన నిస్వార్థ ప్రజా జీవితాన్ని, నిబద్ధతను మరువలేమని భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక కేవీఆర్ కళాశాలలో  తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అర్జునుడు అధ్యక్షతన ఆదివారం సంతాప సభ జరిగింది.

    ఈ సభలో ఆయన మాట్లాడుతూ తంగిరాల తన కుడిభుజం లాంటివాడని, ఆయన మరణం తెలుగుదేశం పార్టీకే కాక నందిగామ నియోజకవర్గానికి తీరని లోటన్నారు. నియోజకవర్గంలో తనదైన శైలిలో ముద్ర వేసుకున్న నిస్వార్థ   ప్రజానాయకుడని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అవినీతిని అంతం చేయాలనే తపన కలిగిన మహా నాయకుడు తంగిరాల అని చెప్పారు.  సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ మాట్లాడుతూ తంగిరాల ఆదర్శవంతమైన నాయకుడన్నారు.  

    విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తంగిరాలను ఆదర్శంగా తీసు కోవాలని చెప్పారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ తంగిరాల ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరువరానివని మరొక సారి ఆయన కుటుంబాన్ని ఆదరించాలని కోరారు.

    ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, వల్లనేని వంశీమోహన్, శ్రీరాంరాజగోపాల్ (తాతయ్య), ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, వైవీపీ రాజేంద్రప్రసాద్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్యేలు  పద్మజ్యోతి, దాసరి బాలవర్థనరావు, మాజీ మంత్రి నెట్టెం రాఘురాం, తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, స్వామిదాసు, సుధారాణి, కడియాల రాఘవారావు, బుద్ద వెంకన్న, కన్నెకంటి జీవరత్నం, కోట వీరబాబు, కేవి.సాంబశివరావు, సూర్యదేవర నాగేశ్వరరావు, గద్దె అనురాధ, కోగంటి బాబు, ఉన్నం నరసింహారావు, అయ్యదేవర కన్నబాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామినేని కృష్ణప్రసాద్  పాల్గొని ప్రసంగించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల్పించారు. ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.  
     
    నిబద్ధత కలిగిన నేత : మొండితోక జగన్మోహనరావు

    ఎంతో అనుభవం ఉన్న నిబద్ధత కలిగిన రాజకీయనాయకుడు తంగిరాల అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ  నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పేర్కొన్నారు. సంతాప సభలో ఆయనమాట్లాడుతూ  ఆయనపై పోటీ చేయటం గర్వంగా ఉందని చెప్పారు. జాతీయ ఉక్కు వినియోగదారుల సలహా మండలి సభ్యుడు శ్రీ బొగ్గవరపు శ్రీ శైల వాసు, మండల కన్వీనర్ నెలకుదిటి శివనాగేశ్వరరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మంగునూరి కొండారెడ్డి, మండల సేవాదళ్ కన్వీనర్ పరిమి కిశోర్ పాల్గొన్నారు.
     
    తంగిరాలను టీడీపీ ఎమ్మెల్యేగా చూడలేదు : మాజీ ఎంపీ లగడపాటి
     
    తంగిరాల ప్రభాకరరావును పార్టీలకతీతంగా సేవాభావం కలిగిన ఎమ్మెల్యేగానే చూశామే తప్పా ఏనాడు టీడీపీ ఎమ్మెల్యేగా భావించలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు.  ఆయనతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలేటి సతీష్, జిల్లా నాయకుడు రేపాల మోహనరావు, కేడీసీసీ డెరైక్టర్ కొమ్మినేని రవిశంకర్, పోపూరి సంగీతరావు తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement