తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వివాద పరిష్కారానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఇరురాష్ట్రాల మంత్రులతో భేటీకానున్నారు.
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాల వివాద పరిష్కారానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ఇరురాష్ట్రాల మంత్రులతో భేటీకానున్నారు. త్వరలో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి సమక్షంలో ఈ సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.
ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఉమాభారతి మంత్రులతో భేటీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భేటీలో ఇరురాష్ట్రాల నుంచి తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఏపీ సాగునీటి శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
హాజరుకానున్నారు.