న్యూఢిల్లీ : శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి వివాదం హస్తినకు చేరింది. కృష్ణా బోర్డు తీర్పుపై మండిపడుతున్న తెలంగాణ సర్కారు విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు సోమవారం కేంద్రమంత్రి ఉమా భారతితో భేటీ అయ్యారు. కృష్ణా బోర్డు తీర్పును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ మేరకు ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా హరీష్ రావు ఓ వినతిపత్రం సమర్పించారు. కాగా ఇందుకు సంబంధించి మధ్యాహ్నం రెండున్నర గంటలకు సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటు చేయిస్తామని ఉమాభారతి హామీ ఇచ్చారు. దాంతో ఈ వివాదంపై మధ్యాహ్నం తర్వాత ఓ స్పష్టత రానుంది.