హరీశ్‌ రావు ఢిల్లీ పర్యటన రద్దు | Harish rao delhi tour cancelled | Sakshi
Sakshi News home page

హరీశ్‌ రావు ఢిల్లీ పర్యటన రద్దు

Published Sat, Jun 4 2016 2:42 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

హరీశ్‌ రావు ఢిల్లీ పర్యటన రద్దు - Sakshi

హరీశ్‌ రావు ఢిల్లీ పర్యటన రద్దు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన రద్దు అయింది. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి శనివారం హరీశ్రావుకు ఫోన్ కాల్ చేశారు. అధికారులు అందుబాటులో లేనందున సోమవారం రావాలని ఆమె సూచించారు. కాగా షెడ్యూల్ ప్రకారం అయితే హరీశ్రావు ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టుల విషయంలో  వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాలమూరు- రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు అక్రమమంటూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఇప్పటికే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ హరీశ్ ...జలవనరుల శాఖమంత్రిని కలవనున్నారు. ఏపీ అసత్య ప్రచారం చేస్తోందంటూ ఆయన ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. హరీశ్తో పాటు పార్టీ ఎంపీలు కూడా ఉమా భారతితో సోమవారం భేటీ అవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement