
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, కొంతమంది టీడీపీ నేతలు తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని షాబాద్, జక్కంపూడి గ్రామస్తులు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కొత్తపేట పోలీసులు దేవినేని ఉమా, టీడీపీ నాయకులపై బుధవారం కేసు నమోదు చేశారు. షాబాద్ గ్రామంలోని కొండ ప్రాంతం వద్ద ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తుంది.
ఆ ఇళ్లను టీడీపీ నేతలు పరిశీలించేందుకు వచ్చి ఏమీ లేని క్వారీలో ఫొటోలు తీశారు. గతంలోనూ ఇదే తరహాలో టీడీపీ నేతలు వ్యవహరించడంతో రెండు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోవడంతో పాటు గొడవలకు దిగారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో గ్రామాల్లో టీడీపీ నేతలు బెదిరింపులకు పాల్పడసాగారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment