బొబ్బిలి : దశాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఇకపై రెండుగా చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆ శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం గతంలో బొబ్బిలిలో సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లాకు తరలించేందుకు అక్కడి టీడీపీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఇక్కడి రైతులతో పాటు అధికారుల్లో వ్యతిరేకత వచ్చింది.
ఇటీవల తుపాను తరువాత రెండు జిల్లాల్లోనూ పర్యటించిన రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు దృష్టికి కూడా రెండు జిల్లాల నాయకులు ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సర్కిల్ కార్యాలయాన్ని తరలించడం కంటే ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ఏర్పాటు చేసుకుంటే మంచిదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేయడంతో అధికారు లు ఆ దిశగా చర్యలు మొదలు పెట్టారు. బొబ్బిలి ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాన్ని ఈ ప్రాంతానికి చెందిన వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు మంజూరు చేయించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంఝావతి జలాశయానికి వాసిరెడ్డి పేరు పెట్టారు. ఈ సర్కిల్ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని నారాయణపురం ఆనకట్ట, తోటపల్లి రిజర్వాయర్, మడ్డువలస ప్రాజెక్టులుండగా, విజయనగరం జిల్లాలో వెంగళరాయసాగర్, జంఝావతి, పెదంకలాం, ఒట్టిగెడ్డ, పెద్ద గెడ్డ రిజర్వాయర్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఇరి గేషన్ డివిజన్, స్పెషల్ కనస్ట్రక్షను డివిజన్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ డివిజన్, స్పెషల్ మైనర్ ఇరిగేషన్ డివిజన్లు ఉన్నాయి.
అలాగే విజయగనరం జిల్లాలో జంఝావతి డివిజన్, పార్వతీపురం డివిజన్ ఉన్నాయి. ఒక్కొక్క డివిజన్‌లో నాలుగేసి సబ్ డివిజన్‌లున్నాయి. ప్రస్తుతం బొబ్బిలి సర్కిల్ అధికారులు ఈ రెండు జిల్లాల జలాశయాల పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అయితే ప్రస్తుతం డీఈ, ఏఈల కొరత కూడా తీవ్రంగా ఉంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొ ని ఏ జిల్లాలో ఉన్న జలాశయాలకు సంబంధించి ఆ జిల్లాలో సర్కిల్ కార్యాలయంలో పెట్టాలని ఆలోచన చేస్తున్నారు.
విజయనగరం జిల్లాకు సంబంధిం చిన విజయనగరం డివిజన్ ప్రస్తుతం వైజాగ్ సర్కిల్‌లో ఉంది. దాన్ని బొబ్బిలి సర్కిల్ పరిధిలో కలపాల్సి ఉంది. ఈ సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు గురి ంచి ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని, దాని ద్వారా శ్రీకాకుళం జిల్లా నాయకులు కోరిక కూడా తీరుతుందని ఇరిగేషన్ అధి కారులు చెబుతున్నారు.
ఇకపై ఎక్కడివి అక్కడే!
Published Tue, Nov 11 2014 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement