విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో నేతలు విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును బుధవారం ఉదయం కలిశారు. ఉద్యోగుల బదిలీలపై నిబంధనలకు విరుద్ధంగా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారంటూ వారు మంత్రికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగులకు అన్యాయం చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.