'ఏపీకి పట్టిన దరిద్రం ఆ మంత్రే' | pardha saradhi takes on devineni uma maheswara rao | Sakshi
Sakshi News home page

'ఏపీకి పట్టిన దరిద్రం ఆ మంత్రే'

Published Thu, Aug 27 2015 4:22 PM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

'ఏపీకి పట్టిన దరిద్రం ఆ మంత్రే'

'ఏపీకి పట్టిన దరిద్రం ఆ మంత్రే'

విజయవాడ: తెలుగువారి హక్కులను ఢిల్లీకి తాకట్టుపెట్టిన ఘనుడు చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ నాయకుడు కె పార్ధసారథి విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు లేదని అన్నారు. కొత్తమాజేరు విషజ్వర బాధితులు, రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా ధర్నా చేసిన వైఎస్ జగన్ పై విమర్శలు చేయడం తగదన్నారు. ఏపీకి పట్టిన దరిద్రం మంత్రి దేవినేని ఉమా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మంత్రి దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలని జోగి రమేశ్ సూచించారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనుడిగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం కొనసాగుతోందని ఆయన దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement