యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
తాడేపల్లిగూడెం: యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా ప్రధాని నరేంద్ర మోదీ పటిష్ట చర్యలు తీసుకున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన రైతు మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. రైతులను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న భూమి చాలా సారవంతమైనదని అమిత్ షా చెప్పారు. రెండున్నరేళ్ల పాలనలో మోదీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు భూసార కార్డులు అందిస్తున్నామని, ఈ-మార్కెట్ ద్వారా రైతులకు మంచి మద్దతు ధర లభిస్తుందని చెప్పారు. ఈ సభలో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర మంత్రులు, పలువురు నేతలు పాల్గొన్నారు.